Prabhas | అయోధ్య రామయ్య కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం..

allroudadda

Prabhas | శతాబ్దాల పోరాటం విజయవంతమై, శ్రీరాముని కోసం కన్న కలలు సాకారమయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు శ్రీరాముడిని దర్శించుకుందామా అనే ఆత్రుత, భక్తి భావన అందరిలోనూ పెరుగుతున్నది. సోమవారం జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య ఆలయానికి చేసిన పూల అలంకరణలు దైవత్వ భావాన్ని మరింత పెంచుతున్నాయని స్థానికులు చెప్తున్నారు.

ఈ అలంకరణలతోపాటు సంప్రదాయం ఉట్టిపడుతూ, మిరుమిట్లుగొలిపే విద్యుద్దీపాల కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామాలయంలోని గర్భగుడిలో సంప్రదాయబద్ధమైన దీపాన్ని మాత్రమే వెలిగిస్తున్నట్లు ట్రస్ట్‌ ప్రతినిధులు చెప్పారు. అయోధ్య అంతా రామమయం అయిపోయిందని భక్తులు ఆనంద తాండవం చేస్తున్నారు.ఇకపోతే అయోధ్య రామ మందిరానికి చాలామంది కానుకలుగా పంపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

allroudadda
allroudadda

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు పొందినటువంటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా భారీగా విరాళం ఇచ్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ విషయం గురించి ఎక్కడ అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ కూడా ప్రభాస్ విరాళం ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.కొందరు 20 కోట్లు ఇచ్చారంటూ ప్రచారం చేయగా మరికొందరు 50 కోట్లు ఇచ్చారు అంటూ ప్రచారం చేస్తున్నారు.

అంబటి రాంబాబు సూపర్ డ్యాన్స్.. సినిమాలో పెడితే సూపర్ హిట్..

ఈ విధంగా ప్రభాస్ డబ్బు ఇచ్చారనే విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ నెటిజన్స్ మాత్రం ఈ వీడియోలపై ఫన్నీగా రియాక్ట్ అవుతూ ఉన్నారు.కొంతమంది 20 కోట్లు ఇచ్చారు అంటూ పోస్టులు చేయగా.ఈ పోస్ట్ పై కొంతమంది స్పందిస్తూ ఇప్పటికే ప్రభాస్ ఆది పురుష్( Adipurush ) సినిమా చేసి శ్రీరాముడిని చాలా ఘోరంగా అవమానించారు.ఆ పాపం పోవాలి అంటే ఈ మాత్రం విరాళం ఇవ్వాల్సిందేలే అంటూ కొందరు కామెంట్స్ చేయగా మరికొందరు మాత్రం సింపతి కొట్టేయడానికి ఇలా విరాళంగా డబ్బు పంపించి ఉంటారు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply