Pragathi: వైరల్ అవుతున్న నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్..!

ప్రగతి (Pragathi) హీరోయిన్గా కెరియర్ ప్రారంభించినా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సెటిల్ అయింది. అమ్మ, అత్త , పిన్ని, వదిన ఇలా పలు పాత్రలకు పోటీ పెరగడంతో కొత్త యాంగిల్ ను డెవలప్ చేసి ఎఫ్2, ఎఫ్3 వంటి చిత్రాలలో కూడా నటించింది.మరొకవైపు సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఈమె వయసుతో నిమిత్తం లేకుండా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ.. హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.

ఇకపోతే ప్రగతి వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే భర్తకు విడాకులు ఇచ్చి ఇప్పుడు ఒంటరిగా జీవిస్తుంది.. కొడుకు, కూతుర్ని పెంచి పెద్ద చేసింది. వారి కెరియర్ లో తనకు చేతనైనంత సహాయం చేస్తానని పేర్కొంది ప్రగతి.. తల్లిగా తన బాధ్యత అని.. అయితే పెళ్లి విషయంలో నేను వారిని ఇబ్బంది పెట్టను అని ఆమె తెలిపింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈమె (Pragathi) మాట్లాడుతూ..

“నేను పెళ్లి చేసుకోవడానికి ముందు ఎన్నో కష్టాలు పడ్డాను.మూడు పూట్ల ఇంట్లో కూర్చొని తింటున్నావని మా అమ్మ నన్ను ఇష్టమొచ్చినట్లు తిట్టేది. అవి భరించలేక పిజ్జా షాపుల్లో ,ఎస్టీడీ బూతుల్లో కూడా పని చేశాను. డబ్బు కోసం, డబ్బు విలువ తెలుసుకోవడం కోసమే అలా చేశాను. అప్పట్లో నేను చాలా లావుగా ఉండేదాన్ని. అటు తర్వాత మెల్ల మెల్లగా మోడలింగ్ చేస్తూ ఆఖరికి సినిమాల్లోకి వచ్చాను.

కానీ, సినిమాల్లో మొదట నాకు అంతగా కలిసిరాలేదు. ఓ హీరోతో ఏర్పడ్డ వివాదం వల్ల సినిమాలు మానేసి 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నాను. కానీ నా భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన అయితే రాలేదు. నా పిల్లలకి పెళ్లిళ్లు అయితే నేను చేయను. పూర్తిగా వాళ్ళ నిర్ణయానికే వదిలేస్తాను. ” అంటూ చెప్పుకొచ్చింది ప్రగతి.

Leave a Reply