Bandla Ganesh | షాక్ బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష..! కారణం ఇదే.

allroudadda

Bandla Ganesh | చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్టు బండ్ల గణేష్‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. బుధవారం నాడు ఒంగోలులోని జిల్లా కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఓ చెక్‌ బౌన్స్‌ కేసులో తీర్పు చెప్పింది. అలాగే రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని ఒంగోలు రెండో అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ పి.భానుసాయి ఆదేశించారు.వివరాళ్లోకి వెళ్తే… మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 2019లో రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు.

అయితే జానకి రామయ్య మరణాంతరం ఆయన తండ్రికి బండ్ల గణేష్ ఈ మొత్తం సొమ్ముకు చెక్ ఇచ్చారు. అయితే… ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం… జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.కాగా… 2017లో బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. “టెంపర్” సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

allroudadda
allroudadda

ఆ కేసులో కూడా జైలు శిక్షతో పాటు రూ.15,86,550 జరిమానా కూడా విధించింది. ఇదే సమయంలో… రూ. 25 లక్షల సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్టు ఈ శిక్ష విధించింది. మరోవైపు చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్.. హీరో పక్కన ఫ్రెండ్ పాత్రలు వేస్తూ నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రవితేజ హీరోగా “ఆంజనేయులు” సినిమాతో ప్రొడ్యూసర్‌ గా మారారు బండ్ల గణేష్! అనంతరం పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతోనూ సినిమాలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు

Recent Posts

Leave a Reply