తాటి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..!

గ్రామీణ భారతంలో తాటి చెట్టు అత్యంత ప్రాధాన్యత గలది. తాటి చెట్టు భాగాలలో పనికి రానిది ఏదీ లేదు. మన దేశంలో తీరప్రాంత రాష్ట్రాలైన గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గోవా, ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా మరియు బెంగాల్‌లో తాటి చెట్లు అధికంగా ఉన్నాయి. ఇవి భారతదేశంలో సుమారు 15 కోట్లు ఉన్నట్లు అంచనా. అందులో అధికంగా తమిళనాడులో ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో సుమారు 3 కోట్లు తాటి చెట్లు ఉన్నాయని అంచనా.

చక్కెర నిచ్చు చెట్లలో తాటి, ఖర్జురా, కొబ్బరి మరియు జీరిక ముఖ్యమైనవి. వీటిలో తాటిలో ఎక్కువ చక్కెర ఉంటుంది. ఈ చెట్లు సహజ సిద్దముగా పెరిగి విరివిగా లభించును. అందువల్ల చాలా ప్రాముఖ్యత కలదు.తాటిలోని అన్ని భాగాలు ఉపయోగకరమైనవి. దాదాపు 800 పైగా ఉపయోగాలు ఉన్నాయని అంచనా.

ఇందులో ముఖ్యమైనవి… నీరా, ముంజెలు, పండ్లు, తేగలు మరియు బుర్రముంజె తినేవాటిలో ముఖ్యమైనవి. వీటితోపాటు వివిధ భాగాలనుండి అనేక రకాలైన పీచు లభించును. వీటిలో ఆడచెట్ల నుండి మాత్రమే లభించు పండ్లు ఆగష్టు నుండి అక్టోబరు వరకు చాలా విరివిగా లభించును.


తాటి గుజ్జు లోని పోషక విలువలు :


తాటి గుజ్జు దాదాపు 78 % తేమ మరియు 15 % చక్కెరలు కలిగి ఉంటుంది. మాంసకృత్తులు 3 %, పీచు పదార్దము 1.7 % తో పాటు ఖనిజ లవణాలు 4.4 % మరియు 100 గ్రా.లలో 3.2 మి.గ్రా. బీటా కెరోటిన్‌ను కలిగి ఉండును. వీటితో పాటు ‘‘సి’’ విటమిన్‌ మరియు అనేక పోషక విలువలు సమృద్ధిగా ఉండును. మామిడి పండ్ల కంటే అధికంగా పోషక విలువలు కలిగి ఉంటుంది.

Leave a Reply