గుడ్ న్యూస్ పంచ్‌ ప్రసాద్‌కు కిడ్నీ దొరికింది.. కానీ..!

జబర్దస్త్ కామెడి షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఫేవరెట్ అయిపోయింది. ఈ షోలో అందర్నీ కడుపుబ్బా నవ్వించే కమెడియన్స్ వారి నిజజీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అందులో ముఖ్యంగా పంచ్ ప్రసాద్ పరిస్థితి దయనీయంగా ఉంది. గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పంచ్ ప్రసాద్ బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ సమస్యతో పోరాడుతూ పంచ్ ప్రసాద్ చాలా ఆస్పత్రులల్లో చికిత్స తీసుకుంటున్నాడు.పంచ్ ప్రసాద్ ను తప్పనిసరిగా డయాలసిస్ చేయించుకోవాలని వైద్యులు తెలిపారు.

లేదంటే పంచ్ ప్రసాద్ ప్రాణాలకే ప్రమాదం. అందుకే ఆయన క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ వస్తున్నారు. పంచ్ ప్రసాద్ కు తోడుగా ఆయన భార్య ఉంటూ సేవలు చేస్తోంది. తన భర్త ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో పంచ్ ప్రసాద్ ఇటీవలే జబర్దస్త్ వేదికపై కనిపించారు.అయితే ప్రస్తుతం పంచ్‌ ప్రసాద్‌ అభిమానులకు ఓ శుభవార్త చెప్పింది ఆయన భార్య. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉండగా.. ఒక కిడ్నీ దొరికిందని ఆమె తమ యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా వెల్లడించింది.

పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ.. ‘ఫస్ట్ నేనే కిడ్నీ ఇద్దామనుకున్నా. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందు నాకు అన్ని టెస్టులు చేశారు. అన్నింటిలోనూ మ్యాచ్ అయ్యాయి. కానీ ఆయనది వయసు చిన్నది కావడంతో డాక్టర్లు వద్దన్నారు. బయట నుంచి తీసుకుందాం అని చెప్పారు. మళ్లీ భవిష్యత్తులో సమస్యలు వస్తే మీ కిడ్నీ తీసుకునేలా ప్లాన్ చేద్దాం అన్నారు. ప్రస్తుతమైతే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్తున్నాం. మీ అందరికీ చెప్పడానికి కారణం ఏంటంటే.. ఆయన ఆరోగ్యం కోసం ఇప్పటికీ చాలా టెస్టులు జరిగాయి.

ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ గురించి ఆయన అభిమానులందరికీ తెలియజేయడం కోసం వీడియో చేశా. మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీతో పంచుకుంటూ ఉంటా. ఇలాంటి వీడియోలు పెడుతున్నందుకు ఏం అనుకోవద్దు. ఇది కేవలం మా ఛానెల్‌ ఆదరిస్తున్న వారందరికీ తెలియజేయడం కోసమే. మీ అందరీ ఆశీర్వాదంతోనే ఆయన కోలుకుంటున్నారని భావిస్తున్నా’ అని అన్నారు.

Leave a Reply