Puri Jagannadh | వాడు రూ.80 కోట్లు కొట్టేసి, మమల్ని రోడ్డున పడేశాడు.. పూరి తల్లి కన్నీరు,

allroudadda

Puri Jagannadh | టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాధ్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా కష్టపడి టాప్ డైరెక్టర్ పొజిషన్ కు చేరుకున్న పూరి జగన్నాథ్ తెలుగు ఇండస్ట్రీ కి చాలా హిట్స్ నే ఇచ్చాడు. ఇప్పుడు స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్న చాలా మంది హీరోలకు వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ లో సూపర్ హిట్స్ ఇచ్చాడు పూరి. తాజాగా పూరి జగన్నాధ్ తల్లి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

పూరి గురించి పలు విషయాలను ఆమె పంచుకున్నారు.” ఏడవ తరగతి నుంచి పూరి జగన్నాథ్ కి సినిమాలపై ఇష్టం పెరుగుతూ వచ్చింది. కాలేజ్ లో చదువుతున్నప్పుడు కూడా ధ్యాస అంతా సినిమాలపైనే ఉండేది. ‘సినిమాల్లోకి వెళతా .. డైరెక్టర్ ను అవుతా’ అని నాతో అంటూ ఉండేవాడు” అని చెప్పారు. ” పూరి ఇష్టం గురించి తెలుసుకున్న తరువాత వాళ్ల నాన్నగారు కూడా ‘సరే’ అన్నారు. అలా వెళ్లిన పూరి 12 ఏళ్లపాటు కష్టపడ్డాడు.

allroudadda
allroudadda

మేము డబ్బులు పంపించినా అవి చాలక, తనకి తెలిసిన పనులు చేస్తూ రోజులు గడుపుతూ వచ్చాడు. కథలు పట్టుకుని అలా తిరుగుతూ ఉండేవాడు. ఎంత దూరమైనా నడిచే వెళ్లేవాడు. ఒకసారి అలా తిరిగొచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. పాదాలు వాచిపోయి సాక్సులు రాలేదు’ అని చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు.” మా అబ్బాయి కష్టాలు చూడలేక మన ఊరు వెళ్లిపోదాం … వ్యవసాయం చేసుకుందువుగాని అని నేను అంటే .. బాధపడొద్దు … దేవుడు ఉన్నాడులే అన్నాడు.

YS Sharmila son | షర్మిల కుమారుడి పెళ్ళికి కూడా వెళ్లని వైఎస్ జగన్‌..

ఆ తరువాత పవన్ కల్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. ఆయన కథ మార్చమంటే పూరి మార్చనని చెప్పాడట. ‘నీలో ఆ నిజాయతీ నచ్చింది’ అని చెప్పి అవకాశం ఇచ్చారట. ఆ సంగతి నాకు చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది” అంటూ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఇక డైరెక్టర్ అయిన తర్వాత ఒక సినిమా షూటింగ్ సమయంలో తన వద్ద పనిచేసే ఓ కుర్రాడు 80 కోట్ల రూపాయలు కొట్టేసి తనని మోసం చేశారు. అదే సమయంలోనే సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా మా కుటుంబం పై పెద్ద పిడుగు పడిందని చెప్పాలి. ఆ దెబ్బకు ఒకేసారి ఐదు ఇల్లు అమ్మేసామని దాదాపు రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది

Recent Posts

Leave a Reply