భార్య‌కు పూరీ జ‌గ‌న్నాథ్ విడాకులు.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకడు. ఇప్పుడు ఆయన అంతగా రాణించలేకపోయినా కూడా ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేశారు. కథ, టేకింగ్, డైలాగ్స్, యూత్ ని అప్రోచ్ అయ్యే తీరు అద్భుతమనే చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న ఎంతో మంది స్టార్స్.. ఆయన దర్శకత్వంలో పరిచయమైన వారే. లైగర్ మూవీ రూపొందించడం.. ఆ తర్వాత మూవీ డిజాస్టర్ నేపథ్యంలో ఆయనపై చాలా రూమర్స్ వచ్చాయి.

. వాటిలో భార్యతో విడాకుల అంశం ఒకటి. కనీసం పూరీ తన కుమారుడి మూవీ ఈవెంట్‌కు కూడా హాజరు కాలేదు. దీంతో పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. పూరి కావాలనే ఫ్యామిలీకి దూరంగా ముంబయిలో ఉంటున్నారని, ఛార్మీ తోనే పర్మినెంట్‌గా ఉండిపోయారంటూ ప్రచారం జోరుగా జరిగింది. అంతేకాదు.. ఒకడుగు ముందుకేసి మరీ పూరీ తన భార్యకు విడాకులు కూడా ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.

తాజాగా పూరీ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తమ సొంతూరు నర్సీపట్నంలో అన్నదమ్ములు, భార్యాపిల్లతో కలిసి పూరీ సందడి చేశారు. అందరితో కలిసి హోమంలో పాల్గొన్నారు. ఫ్యాన్స్ భార్య లావణ్యతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ పూరీ జగన్నాథ్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ సంతోషంగా ఉందన్నారు. అన్నా వదినలను ఇలా చూడంటం ఆనందంగా ఉంది అంటూ తెలిపారు.

Leave a Reply