Pushpa 2:బన్నీ అమ్మవారి అవతారం వెనకున్నఇంత పెద్ద కథ ఉందా..!

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప మానియా ఆవరించింది. పుష్ప-2 టీజర్ విడుదలతో నెట్టింట పుష్పరాజ్ పేరు హోరెత్తుతుంది. ఎటు చూసిన పుష్ప పుష్ప.. వేర్ ఈజ్ పుష్ప నేమ్‌ అండ్ సీన్స్‌ నెట్టింట వీరంగం సృష్టిస్తున్నాయి. ఇవన్నీ సినీ ప్రేక్షకుల్లో పుష్ప పార్ట్-2 ది రూల్ పై అంచనాలను అమాంతం రెట్టింపు చేస్తున్నాయి. ఈ మూవీ కోసం యావత్ సినీలోకం ఎంతో ఆతృతతో ఎదురుచూసేలా చేస్తున్నాయి.

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగా ఏప్రిల్ 7న విడుదలైన పుష్ప 2 టీజర్ చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ టీజర్ పుష్ప-2 సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఊరమాస్ లుక్ లో ఉన్న బన్నీ అవతారం చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆడియన్స్ అంచనాలకు మించి టీజర్ ఉండడంతో ఈసినిమాపై బాగా హైప్ క్రియేట్ అయ్యింది.

ఇందులో అల్లు అర్జున్ అమ్మవారి అవతారంలో ఉండి చేతిలో తుపాకీ పెట్టుకొని ఉండడం అందర్నీ ఆకర్షిస్తుంది. అయితే ఈ గెటప్ వెనక చాలా కథ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది మే నెలలో తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ జాతర సందర్భంగా ఆడ మగ అని తేడా లేకుండా వివిధ వేషధారణలో వేడుకలో పాల్గొంటుంటారు.

ఈ వేడుకల్లో అబ్బాయిలు అమ్మవారి వేషధారణలో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ‘పుష్ప-2’ సినిమాలో అల్లు అర్జున్ కూడా దీన్నే పాటించినట్టు తెలుస్తోంది.అమ్మవారి వేషధారణలో మెడ లో నిమ్మకాయల దండ నుదుటిన సింధూరం పెట్టుకున్న బన్నీ రూపం గంగమ్మ అవతారాన్ని తెలియజేస్తుంది. ఈ ఫోటోను బట్టి చూస్తే జాతర నేపథ్యంలో యాక్షన్ సీన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Leave a Reply