లీకైన నా వీడియోలు పేరెంట్స్ తోపాటు డ్రైవర్ కూడా చూశాడు.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

రాధికా ఆప్టే తెలుగు ప్రేక్ష‌కులకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఈమె ర‌క్తచ‌రిత్ర సినిమాతో టాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేసింది. ఆ త‌ర్వాత బాల‌య్య స‌ర‌స‌న ల‌య‌న్, లెజెండ్ వంటి సినిమాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత టాలీవుడ్ కి దూర‌మై.. బాలీవుడ్ కే ప‌రిమిత‌మైంది. ఇక బాలీవుడ్ లో ఈమె చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. ఆ మ‌ధ్య ఓ న్యూడ్ క్యారెక్ట‌ర్ చేసిన రాధికా ఆప్టే పెద్ద సంచ‌ల‌న‌మే సృష్టించింది. ఆమె చేసిన న్యూడ్ క్యారెక్ట‌ర్ లీకై షోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టింది. రాధికను సోషల్ మీడియాలో విపరీంగా ట్రోల్ చేశారు నెటిజ‌న్లు. ఇప్పుడా షార్ట్ ఫిల్మీంలో చేసిన వీడియోపై స్పందించింది రాధిక‌.

గ‌తంలో ఈ హాట్ హీరోయిన్ చేసిన న్యూడ్ ఫిలీం గరించి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడింది. ఆ ఫిల్మ్ ఎలా లీక్ అయిందో అర్థం కావ‌డం లేదంటూ చెప్పుకొచ్చింది. కొన్నేళ్ల కిందట రాధిక‌ న్యూడ్ క్లిప్ ఒకటి లీక్ అయి సోష‌ల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. ‘క్లీన్ షేవెన్’ అనే షార్ట్ ఫిలింకి సంబంధించిన క్లిప్ అది. దాని గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నారు.కానీ.. వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆ టైంలో సోషల్ మీడియాలో ఎవరేమంటున్నారు..

మీడియా వాళ్లు ఏం రాస్తున్నారు అన్నది తాను పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంది. తనకు సంబంధించి బయటికి వచ్చిన తొలి న్యూడ్ క్లిప్ అదే అని రాధిక పేర్కొంది. అయితే తన చుట్టూ ఉన్న వాళ్లు చూసే చూపులు త‌న‌ను బాగా ఇబ్బంది పెట్టాయిని రాధిక చెప్పింది. వీడియోలో ఉన్నది తానే అని గుర్తించి.. తమ వాచ్‌మ్యాన్, డ్రైవర్ లాంటి వాళ్లు అదోలా చూడటం మొదలుపెట్టారని.. వాళ్లను ఫేస్ చేయలేక తాను నాలుగు రోజుల పాటు ఇంటికే పరిమితం అయ్యానని రాధిక చెప్పింది.

ఇక ఆ త‌ర్వాత‌ ‘పార్చ్డ్’ సినిమా కోసం బోల్డ్‌గా నటించానని తెలిపింది. అందులో పూర్తి నగ్నంగా కనిపించానని ఆ రోల్ చేశాక తనలో ధైర్యం వచ్చిందని చెప్పింది. నాలో దాచుకోవ‌డానికి ఏమీ లేద‌నే అభిప్రాయం కలిగి అప్పట్నుంచి ధైర్యంగా ఉంటున్నానని రాధికా చెప్పింది. ‘పార్చ్డ్’ సినిమాలో అదిల్ హుస్సేన్‌తో కలిసి రాధికా చేసిన రోమాన్స్ అంతా ఇంత కాదు.. ఆ సినిమాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అయింది. ఈ సినిమాలో రాధిక నటనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి.

Leave a Reply