అంబానీ కాబోయే కోడలి బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే,

ముఖేష్ అంబానీ. అపరకుబేరుడు. వారి ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా వారి స్థాయికి తగినట్లుగానే దర్పంగా గ్రాండ్ గా ఉంటుంది. ఎంగేజ్ మెంట్..వివాహాలు అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఇక ముంబై నగరం అంతా సందడే సందడిగా మారిపోతుంది. అంబానీ భార్య నీతా అంబానీ నిర్వహించే వేడుకలు కూడా అలాగే ఉంటాయి. నీతా అంబానీ ఇచ్చే గిఫ్ట్ లు కూడా ఆరేంజ్ లోనే ఉంటాయంటారు సన్నిహితులు.

ముఖ్యంగా నీతా అంబానీ కట్టుకునే చీరలు, ధరించే నగలు కూడా ప్రత్యేక డిజైన్ తో చేయించుకున్నవే ఉంటాయి.ఇక విషయంలోకి వస్తే రాధిక ఓ కార్యక్రమానికి హాజరై దిగిన ఫోటోలో ఆమె చేతిలో ఉన్న చిన్నబ్యాగుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. దాని ఖరీదు 63,750 డాలర్లు కావడమే దీనికి కారణం. మన కరెన్సీలో చెప్పాలంటే అరకోటికిపైగానే. కచ్చితంగా చెప్పాలంటే కరెన్సీలో రూ.52, 30,000.​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​

అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ చేపట్టిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి కాబోయే కోడలు ఈ బ్యాగుతో వచ్చింది. హెర్మెస్ కెల్లిమోర్ఫస్ బ్రాండకు చెందిన ఈ బ్యాగుకు మెటల్ చైన్, షార్ట్ స్ట్రాప్, మిక్ ఫ్రంట్ ఫ్లాప్, సిగ్నేచర్ కెల్లీ వంటి మరెన్నో విశేషాలు ఉన్నాయి. నల్ల చీరతో వెండిరంగులోని ఖరీదైన బ్యాగు పట్టుకున్న రాధికపై సోషల్ మీడియాలో నానా కామెంట్లూ పెడుతున్నారు.

Leave a Reply