Wife-Husband | చిరంజీవి కోసం రైలులో ఆ సౌకర్యం కలిపిచ్చిన దర్శకుడు ఎవరో తెలుసా..?

allroudadda

Wife-Husband | చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. 1980 ఫిబ్రవరి 20 అప్పుడే సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన చిరంజీవికి అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో వివాహం జరిగింది. చిరంజీవి ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఊటీలో అని నిర్మాత చెప్పాడు. చిరంజీవికి అప్పుడే వివాహం అయ్యింది. భార్య సురేఖను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పడం లేదు . అందుకే ఈ విషయాన్నీ ఆ చిత్ర నిర్మాతకు చెబితే ‘అయితే ఆమె ను కూడా తీసుకురండి ” అన్నారు. చిరంజీవికి మహా సంతోషం వేసింది .

మొదటిసారి తన భార్య సురేఖతో కలసి ఊటీ వెడుతున్నాడు . ఆ భావనే అతనికి కిక్కు ఇచ్చింది. ఈ విషయం సురేఖకు చెబితే ఆమె కూడా సంబరపడింది.ఇద్దరూ కలసి ఊటీ వెళ్లారు .అక్కడ సరదాగా గడిపారు . భర్త షూటింగ్ చేస్తుంటే సురేఖ అబ్బురంగా చూసేది. షూటింగ్ పూర్తి అయిన తరువాత మద్రాస్ ప్రయాణమయ్యే రోజున దర్శకుడిని కలసి “భార్య తో కలసి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు . అదే రోజు సాయంత్రం ఊటీ నుంచి క్రింద వున్న మెట్టుపాళయం స్టేషన్ లో రైలు ఎక్కితే మద్రాస్ చేరతారు.

allroudadda
allroudadda

చిరంజీవి , సురేఖ యూనిట్ తో పాటు క్రిందకు వచ్చారు. స్టేషన్లో వున్న ప్రొడక్షన్ మేనేజర్ “సర్ మీ ఇద్దరికీ కూపే బుక్ చేశాము ” అని చెప్పాడు.అది విని చిరంజీవి ఎంతో ఆశ్చర్యపోయాడు . తనలాంటి చిన్న నటుడుకు కూపే నా ? అనుకున్నాడు. ఈ విషయం సురేఖకు చెబితే ఆమె చాలా సంతోషపడింది. ఇద్దరూ ట్రైన్ ఎక్కి తమకు రిజర్వు చేసిన కూపే లోకి వెళ్లారు . అంతే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు . తాము నిజంగానే తమకు కేటాయించిన కూపే లోకి వచ్చామా ? పొరపాటున మరో దానిలోకి వచ్చామా ? అని డోర్ దగ్గరే నిలబడ్డారు .

allroudadda
allroudadda

అక్కడే వున్న ప్రదిక్షన్ మేనేజర్ ” ఇది మీదే సర్ ” అని చెప్పాడు. కూపే లోపల పూలు , పళ్ళు ,పాలు ఏర్పాటు చేశారు . కూపే అంత అగరొత్తుల సువాసనతో నిండిపోయింది. ఈ ఏర్పాటు చూసి సురేఖ సిగ్గుపడిపోయింది . చిరంజీవి కొత్త పెళ్లి కొడుకులా ముసిముసి నవ్వులు సురేఖ వైపు విసిరాడు .ఇంతకీ ఇలాంటి శోభనం ఏర్పాటు చేసిన ఆ దర్శకుడు ఎవరో తెలుసా ? కే. రాఘవేంద్ర రావు . ఆ సినిమా మోసగాడు .రాఘవేంద్ర రావు తెర మీదనే కాదు తెర వెనుక కూడా చిలిపి కృష్ణుడే . ఈ సంఘటన “పెళ్లి సందడి ” సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రంలో చిరంజీవి రైలులో ఏర్పాటు చేసిన శోభనం గురించి స్వయంగా వివరించారు .. రాఘవేంద్ర రావు

Recent Posts

Leave a Reply