ఒడిశా రైలు ప్రమాదానికి బయటపడ్డ అసలు నిజం..!

షాలిమార్ నుంచి చెన్నైకి వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (12841) మొదట పట్టాలు తప్పింది. -12 బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడిపోయాయి. సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే కాసేపటి తర్వాత యశ్వంత్‌పూర్-హౌరా రైలు (12864) ట్రాక్‌పై పడిన ఈ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలుకు చెందిన 17 బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ఇప్పటికీ ప్రమాదంలో మృతుల సంఖ్య 300కి చేరింది.

900మందికి పైగా గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాసేపట్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ క్షతగాత్రులను పరామర్శించనున్నారు. మరో వైపు మృతుల్లో బెంగాల్ కు చెందిన వారు ఎక్కువగా ఉండటంతో సీఎం మమతా బెనర్జీ సంఘటనా స్థలానికి చేరుకుని పరామర్శిస్తారని ఆ పార్టీ ఎంపీ డోలాసేన్ తెలిపారు.

మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ పరిహారం ప్రకటించింది. మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.ఇప్పటివరకు బెంగళూరు నుంచి హౌరా వెళ్తోన్న ట్రైన్‌ పట్టాలు తప్పిందని ప్రచారం జరిగింది. యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను కోరమండల్‌ను ఢీకొడితే.. కోరమండల్‌ను గూడ్స్‌ ఢీకొట్టినట్టు చెప్పుకొచ్చారు అధికారులు. కానీ, అందులో నిజం లేదని తేలింది . మొత్తం ప్రమాదానికి సిగ్నలింగ్‌ అండ్ టెలికమ్యూనికేషన్‌ ఫెయిల్యూరే కారణంగా తేలింది.

Leave a Reply