డాన్స్ తో దుమ్ము లేపిన రాజన్న చైల్డ్ ఆర్టిస్ట్ మల్లమ్మ వీడియొ వైరల్…!

టాలీవుడ్ లోకి బాల నటిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది చిన్నారి అనీ.. కానీ ప్రస్తుతం ఈమెను చిన్నారి అని పిలవడం బాగుండదేమో. చాలా పెద్దదయి పోయిన అనీ… తాజాగా దిగిన ఫొటోలను చూసిన నెటిజన్లు అంత చిన్న పిల్లలా ఉన్న అనీ ప్రస్తుతం టాప్ హీరోయిన్ లా మారిపోయిందని అంటున్నారు. తన అందంతో నెటిజన్ల చూపును మరల్చకుండా చేస్తుంది. అనీ.. ఈ చిన్నారిది కేరళ కావడం విశేషం.

ఇప్పటికే చాలా మంది కేరళ కుట్టీలు మన తెలుగు ఇండస్ర్టీని ఏలుతున్నారు. తమ అందాలతో ఒంపు సొంపుల వయ్యారాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్నారు. తాజాగా చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నంది అవార్డు కూడా గెలుచుకున్న అనీది కూడా కేరళనే కావడం విశేషం.ఈ చిన్నారి జగపతి బాబు చార్మి హీరో హీరోయిన్లుగా నటించిన అనగనగా ఒక రోజు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో చిన్న రోల్ చేసింది కానీ అవేవీ తనకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దర్శక ధీరుడు రాజమౌళి మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో తాను చేసిన పాత్రతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక అప్పటి నుంచి తాను బాల నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. అటు తర్వాత ఈ చిన్నారి రాజన్న సినిమాలో చేసిన రోల్ కు నంది అవార్డుకు ఎంపికైంది. ఆ మూవీ హీరో నాగార్జునతో సమానంగా నటనలో ఇరగదీసింది.

అందరి చేత ఔరా అని అనిపించుకుంది. కే విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మల్లమ్మగా అనీ చేసిన నటనకు మంచి మార్కులు పడడమే కాకుండా నంది అవార్డును కూడా గెలుచుకుంది.ప్రస్తుతం ఈ చిన్నారి ఫొటోలు సోషల్ మీడియాలో ముచ్చట గొల్పుతున్నాయి.అలాగే తాజాగా పల్సర్ బైక్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది.ప్రస్తుతం ఈ వీడియొ సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.ఈ మధ్యకాలంలో అన్ని సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంది.

https://www.instagram.com/reel/CiXSq6Zp_NK/?utm_source=ig_web_copy_link

Leave a Reply