Rajesh Mahasena | నాకు చెప్ప కుండా జనసేన కి టికెట్ ఇస్తున్నారు..

allroudadda

Rajesh Mahasena | తెలుగుదేశం-జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించినప్పుడు ఓ వ్యక్తి పేరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదేమిటంటే ‘మహాసేన రాజేష్’. పి.గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే మహా సేన రాజేష్ అర్హుడే కాడంటూ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మహాసేన రాజేష్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించమని పలువురు బహిరంగంగా విమర్శించారు.

గతంలో కొన్ని కులాలను ఉద్దేశించి మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యాయి. పలు కుల సంఘాలు మహాసేన రాజేష్ కు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చారు. జనసేనకు పి.గన్నవరం టిక్కెట్ దక్కుతుందని భావించిన జనసేన మద్దతుదారులు కూడా వారితో చేరారు.ఇలాంటి సమయంలో మహాసేన రాజేష్ సంచలన ప్రకటన చేశారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

allroudadda
allroudadda

నేను మళ్లీ కుల రాక్షసుడికి బలి అయ్యాను అన్నారు.. అయితే తాజాగా పొత్తులో భాగంగా గన్నవరం సీటును జనసేనకు ఇవ్వాలని టిడిపి నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.ఈ విషయం పైన రాజేష్ మాట్లాడుతూ గన్నవరంలో తనను తప్పించినట్లుగా చంద్రబాబు చెప్పలేదని టిడిపిజనసేన తనను అవమానిస్తున్నట్టుగా ఉందంటూ వెల్లడించారు..ప్రస్తుతం మూడు పార్టీలు పొత్తులో ఉన్నాయని తనను తప్పించినట్లుగా చెప్పకుండానే జనసేన అభ్యర్థుల పేరుతో పి గన్నవరంలో ఐవిఆర్ఎస్ కాల్స్ పేరుతో సర్వేలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వెల్లడించారు..

ఇక్కడ తాను ఇన్చార్జిగా ఉంటుందని గుర్తు చేస్తున్నానని చంద్రబాబు తనకు సీటు లేదు పక్కన ఉండు అని చెప్పే వరకు ఉండాలి కదా అంటూ తమ పార్టీ పైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ మహాసేన రాజేష్. ఒకవేళ ఈ సీట్ జనసేన కోరుతూ ఉంటే తనని అవమానించినట్టే అంటూ వెల్లడించారు అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది

Leave a Reply