మా నాన్న అలా అవ్వడానికి వాళ్ళే కారణం..! రాకేష్ మాస్టర్ కొడుకు కన్నీరు,

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల అనారోగ్యం తో మృతి చెందారు అన్న విషయం తెలిసిందే. ఆయన మృతి పై ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసి గుర్తింపుని సంపాదించుకున్నారు. అంతేకాదు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోలకు సైతం డాన్స్ నేర్పించి అప్పట్లో టాప్ కొరియోగ్రాఫర్ గా హవా నడిపించారు రాకేష్ మాస్టర్.

అంతే కాదు ఇక శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ లాంటి గొప్ప కొరియోగ్రాఫర్లు అందరూ కూడా ఒకప్పుడు రాకేష్ మాస్టర్ శిష్యులే కావడం గమనార్హం.అలాంటి రాకేష్ మాస్టర్ ఆ తర్వాత కాలంలో మాత్రం కొన్ని వివాదాస్పద వీడియోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి రాకేష్ మాస్టర్ వీడియోలు చేస్తూ ఉండేవారు..

ఒక రకంగా చెప్పాలంటే కొరియోగ్రాఫర్ గా ఉన్న సమయంలో రాకేష్ మాస్టర్ కు ఉన్న మంచి పేరు మొత్తం ఆ తర్వాత కాలంలో ఆయనపై వచ్చిన చెడు ప్రచారం కారణంగా పూర్తిగా పోయింది అని చెప్పాలి. ఎంతోమంది రాకేష్ మాస్టర్ ను తిట్టుకున్నారు. ఇకపోతే ఇటీవల కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కొడుకు షాకింగ్ కామెంట్స్ చేశాడు.మా నాన్నకు ఇలా జరగడానికి సోషల్ మీడియా ప్రధాన కారణం. చాలా యూట్యూబ్ ఛానెల్ లు మా నాన్న ను తమ స్వలాభం కోసం ఉపయోగించుకున్నాయి.

నాన్న ను వీరంతా చెడుగా చిత్రీకరించారు. అలాంటి వీడియోల ను ఇప్పుడే ఆపండి. నాన్న వీడియోల ను ప్రచురించడం మానేయండి. సోషల్ మీడియా వేదికల పై మా కుటుంబ సమస్యల ను ప్రస్తావిస్తూ వేధించకండి. మా కుటుంబానికి మీరు చేసిన నష్టం చాలు.. అంటూ తీవ్ర ఆవేదనను చరణ్ వ్యక్తం చేసాడు.మా జీవితాల ను చీకటి లోకి లాగవద్దు. ఎవరైనా మా జీవితాల్లోకి మళ్లీ చూడాలనుకుంటే నేను పోలీసుల ను ఆశ్రయించాల్సి ఉంటుంది. మా భవిష్యత్ పై కథనాలు మీరు వేయాల్సిన అవసరం లేదని రాకేష్ మాస్టార్ కుమారుడు చరణ్ హెచ్చరించారు.

Leave a Reply