Rashmika Mandanna | రష్మిక అలాంటి అమ్మాయి కాబట్టే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా.. రక్షిత్ శెట్టి

allroudadda

Rashmika Mandanna | కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమించుకొని, పెళ్లి వరకు వెళ్లి విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే. రక్షిత్ హీరోగా తెరకెక్కిన ‘కిరాక్ పార్టీ’ సినిమాతోనే రష్మిక ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ మూవీ మేకింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడి పెళ్ళికి వరకు వెళ్లారు. 2017లో ఈ ఇద్దరు తమ కుటుంబసభ్యుల మధ్య ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నారు.కానీ ఏమైందో ఏమో 2018లో ఈ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకున్నారు.

ఆ తరువాత ఇద్దరు సినిమాలతో బిజీ అయ్యిపోయారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు మళ్ళీ ప్రేమ, పెళ్లి అని మాట్లాడలింది లేదు. ఇక వీరి బ్రేకప్ గురించి కూడా వీరిద్దరూ బయట పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. తాజాగా రక్షిత్ దీని గురించి మాట్లాడాడు. రక్షిత్ నటించిన రీసెంట్ మూవీ ‘సప్త సాగరాలు దాటి’ తెలుగులో రిలీజ్ అయ్యింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు.ఈక్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో రక్షిత్‌ని.. ‘మీ బ్రేకప్ అయ్యి 5 ఏళ్ళు అవుతుంది.

allroudadda
allroudadda

మీరెందుకని ఇంకా పెళ్లి చేసుకోలేదు’ అని ప్రశ్నించారు. దీనికి రక్షిత్ శెట్టి బదులిస్తూ.. “బ్రేకప్ తరువాత నా పర్సనల్ జీవితాన్ని పూర్తిగా మర్చిపోయాను. ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమా పైనే పెట్టాను. సినిమానే నా ప్రెజెంట్ లవ్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.తాజాగా రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో గత కొద్దికొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎలా వైరల్ గా మారిందో మనకు తెలిసిందే. ఈ వీడియో కారణంగా ఏకంగా కేంద్ర మంత్రులు కూడా స్పందించి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఇలా రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో పై పలువురు సినీ సెలబ్రిటీలు కూడా స్పందించి ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. ఇలా ఫేక్ వీడియోలకు పాల్పడిన వారి పట్ల చర్యలు తీసుకోవాలని సెలబ్రిటీలు కూడా డిమాండ్ చేశారు.యితే తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియో పై రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి స్పందించారు. ఇలాంటి వాటి పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రతి సాఫ్ట్‌వేర్ కి లైసెన్స్ కంపల్సరీ అనే రూల్ తీసుకు రావాలి.ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ అందరికి అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ముందుగా అరికట్టాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక రష్మిక గురించి మాట్లాడుతూ ఆమె చాలా పెద్ద కళలు ఉన్న అమ్మాయి అంటూ రష్మిక గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

Recent Posts

Leave a Reply