Rakul Preet Singh | పెళ్లికి ముందు ర‌కుల్ వేసుకున్న డ్రస్ చూసి నెటిజన్స్ షాక్.

allroudadda

Rakul Preet Singh | స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటుడు/నిర్మాత జాకీ భగ్నానిని ఫిబ్రవరి 21న గోవాలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా రకుల్ పెళ్లి గురించి ఎన్నో విశేషాలు బాలీవుడ్ మరియు టాలీవుడ్ మీడియాలో వస్తున్నాయి. తాజాగా రకుల్ ప్రీత్ తన సన్నిహితుల కోసం థాయ్‌లాండ్‌లో గ్రాండ్‌గా బ్యాచిలర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి హాజరైన వారిలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్ కూడా ఉన్నారు.

నిజానికి మొదట ఫారిన్ లొకేషన్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్న రకుల్ చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకుని ఇప్పుడు గోవాలో అడుగుపెట్టారు.ఈ వివాహానికి హిందీ, తెలుగు సినిమా పరిశ్రమలకి చెందిన కొందరు ప్రముఖులు హాజరు కానున్నారు. ర‌కుల్ ప్రీత్ పెళ్లికి సిద్ధమ‌వుతున్న వేళ లేటెస్ట్ గా త‌న‌ ఫోటోషూట్లు అభిమానుల్లో వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా ర‌కుల్ బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.

allroudadda
allroudadda

మాజీ మిస్సు, స్టార్ హీరోయిన్ ర‌కుల్ 33 ఏజ్ లోను ఎంతో బ్యూటిఫుల్ గా టీనేజీ లుక్ తో క‌నిపిస్తోంది. ఇటీవ‌ల పూర్తిగా స్లిమ్ లుక్ లోకి మారిన ర‌కుల్ థై స్లిట్ బ్లాక్ డిజైన‌ర్ గౌన్ లో ఏంజెల్ ని త‌ల‌పిస్తోంది.ఈ ఫోటోషూట్ కి బ్లాక్ ఈజ్ మిస్ట‌రీ అంటూ అంద‌మైన క్యాప్ష‌న్ ని కూడా ఇచ్చింది. ‘నలుపు అనేది మిస్టరీ’ అని బ్లాక్ ల‌వ్ ఈమోజీని షేర్ చేసింది. ఈ బ్లాక్ మిస్ట‌రీ గౌన్ కి త‌గ్గ‌ట్టుగానే త‌న అంద‌మైన మెడ‌లో వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్ నెక్లెస్ ని ధ‌రించింది. ర‌కుల్ కొత్త లుక్ పై త‌న స్నేహితురాలు ప్ర‌గ్య జైశ్వాల్ ప్ర‌శంస‌లు కురిపించింది. అభిమానులు ల‌వ్ ఈమోజీల‌ను షేర్ చేస్తున్నారు.

Recent Posts

Leave a Reply