రామ్ చరణ్ కూతురు పేరు చూసి ఆశ్చర్యపోతున్నా నెటిజన్స్..!అంతా అర్దం ఉందా

మెగాపవర్ స్టార్, గ్లోబర్ స్టార్ అయిన రామ్ చరణ్ అండ్ ఉపాసన ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇంట మెగాప్రిన్సెస్ అడుగుపెట్టింది. జూన్ 20న ఉపాస‌న పండంటి ఆడ‌బిడ్డ‌కి జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలిలోనే కాకుండా అభిమానుల్లో సైతం సంతోషం నెలకొంది. ఇక మెగా వారసురాలిని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అంతేకాకుండా మెగాప్రిన్సెస్ కి ఏ పేరుని పెడుతున్నారు? అని పలురకాల ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆల్రెడీ తన కూతురికి తాము ఒక పేరు అనుకున్ననట్లు ఇటీవల ఓ రామ్ చరణ్ తెలిపారు. ఆ పేరుని తన పాప బారసాల నాడు తానే అందరికి తెలియజేస్తాను అని కూడా రాంచరణ్ తెలిపాడు.జాగా తన మనవరాలి పేరు తెలియజేస్తూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

రామ్ చరణ్, ఉపాసన కూతురి పేరు క్లింకారా (Klin Kaara) అనే పెట్టినట్లుగా తెలిపారు.క్లింకారా అనేది లలితాసహస్రనామాల్లో ఒక బీజాక్షం. ప్రకృతికి శక్తికి ప్రతిరూపం అర్థం అని.. ఆ పేరుతో ఒక శక్త, పాజిటివ్ వైబ్రేషన్ ఉందని.. ఈ లక్షణాలని మా లిటిల్ ప్రిన్సెస్ అందిపుచ్చుకొని తన వ్యక్తిత్వతంలో పెరిగేకొద్దీ ఇమడ్చుకుంటుందని నమ్ముతున్నట్లు తెలిపారు.దీనితో ఈ పేరు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply