Ram Gopal Varma | ఆయన దర్శకుడా లేక రసిడా.. వర్మ మాయలో మరో భామ..

allroudadda

Ram Gopal Varma | టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మొదటగా కొన్నేళ్ల క్రితం విజయవాడ నుండి సినిమాల పై ఇంట్రెస్ట్ తో సినిమా ఇండస్ట్రీకి ప్రవేశించాడు. అయితే అప్పట్లో కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పని చేసిన వర్మ, ఆ తరువాత మెల్లగా తన టాలెంట్ తో దర్శకుడిగా మారాడు. ఆ తరువాత పలు విజయవంతమైన సినిమాలు తీసిన వర్మ, అప్పట్లో కొన్ని సంచలన విజయాలు కూడా అందుకున్నారు. తెలుగులో వెంకటేష్, నాగార్జునలతో సూపర్ హిట్స్ తీసి, ఆ తరువాత బొంబాయి చేరి, అక్కడి బాలీవుడ్ దిగ్గజ నటులను కూడా దర్శకత్వం వహించి దేశవ్యాప్తంగా మంచి పేరు గడించాడు.

కానీ ఇటీవల కొన్నేళ్లుగా మాత్రం వర్మ తీస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. మొదటి నుండి ఏ విషయాన్ని అయినా మొహం మీదే కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడే అలవాటున్న వర్మ, కొన్నాళ్లుగా పలు వివాదాస్పద అంశాలతో సినిమాలు తీస్తూ వస్తున్నారు. కొద్దిరోజుల క్రితం రక్త చరిత్ర, వంగవీటి, బెజవాడ, లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు వంటి వివాదాస్పద సినిమాలు తీసిన వర్మ, వ్యూహం సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అది పక్కన పెడితే వర్మ వద్ద కొందరు హీరోయిన్స్ ఉన్నారు. వాళ్లతో తరచుగా మందు కొడుతూ కనిపిస్తూ ఉంటాడు వర్మ. నైనా గంగూలీ, అప్సర రాణి వర్మ హీరోయిన్స్ లో కొందరు.

allroudadda
allroudadda

తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ తో మందు తాగుతున్న ఫోటో షేర్ చేశాడు. చీర్స్… మీరు నన్ను చూసి కుళ్ళుకుని చచ్చిపోతే ఇంకో రెండు పెగ్గులు ఎక్కువ వేస్తా… అని సదరు ఫోటోకి కామెంట్ జోడించాడు. వర్మ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఎప్పటిలాగే వర్మ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. కొందరు లైఫ్ అంటే రామ్ గోపాల్ వర్మదే అని కామెంట్స్ పెడుతుండగా, మరికొందరు వల్గర్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Recent Posts

Leave a Reply