Sarath Babu: రమాప్రభ శరత్ బాబు… ఎవరు ఎవరిని మోసం చేశారు? 

వరుస విషాదాలు టాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. సినీ ప్రముఖులు వరుసగా ఈ లోకాన్ని విడిచి వెళ్తుండటం ఆవేదనను కలిగిస్తోంది. సీనియర్ నటుడు శరత్ బాబు కూడా మృతి చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని నిన్న ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు.

అనంతరం చెన్నైకి తరలించారు.ఐతే తెలుగు సినిమా పరిశ్రమలో నటులుగా శరత్ బాబురమ ప్రభలకు మంచి పేరు ఉంది.చిన్న వయస్సు నుంచే సినిమా పరిశ్రమలో రాణించి కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్న వీరు ఎన్నో సినిమాలలో కలిసి పనిచేశారు.అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీయగా అది కాస్తా పెళ్లి దాకా వెళ్ళింది.అయితే ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు వాస్తవానికి శరత్ బాబును చూడగానే ఏ అమ్మాయి అయినా ప్రేమలో పడిపోతుంది .

అలాగే అప్పటికే సినిమా రంగంలో లో సెటిల్ అయిన రమాప్రభ కూడా శరత్ బాబును ప్రేమించింది.ఆయన కూడా ఆమె మంచితనం నచ్చి ఇష్టపడ్డాడు.కానీ వివాహం తర్వాత వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు అన్న విషయాన్ని గ్రహించారు.చివరికి వారిద్దరూ మనస్పర్ధలు కారణంగా వైవాహిక జీవితానికి దూరం అయ్యారు.వయసులో శరత్ బాబు కన్నా రమాప్రభ పెద్దదైన వివాహం చేసుకున్నారు .అయితే అనుకోని గొడవల వలన విడిపోవాల్సి వచ్చింది .

అప్పటి నుంచి రమాప్రభ ఒంటరిగాజీవితాన్ని కొనసాగిస్తోంది .అప్పట్లో వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం కలగడమే కాదు రమా ప్రభ ఆస్తులను శరత్ బాబు కరిగించేశాడు అన్న ఆరోపణ కూడా శరత్ బాబు పైన ఉంది.ఆయన వల్లే ఆమె రోడ్డున పడ్డాను అని తన ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను అని రమా ప్రభ కూడా పలు సందర్భాల్లో కన్నీటి పర్యంతమయింది.ఏదేమైనా ఇద్దరు విడిపోవడం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది .

Leave a Reply