Actress Rambha | జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ పై మోజు పడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.

allroudadda

Actress Rambha | రంభ.. ఈ పేరు వింటే అప్పట్లో అంటే, 90s కుర్రకారుకి నిద్ర పట్టేది కాదేమో. అచ్చు దేవలోకం నుంచి దిగి వచ్చిన రంభలా ఉంటుంది రంభ. అందుకే.. అమ్మడి అందానికి రాజమౌళి కూడా ఫిదా అయిపోయాడేమో. యమదొంగ సినిమాలో రంభతో స్పెషల్ సాంగ్ చేయించాడు దర్శక ధీరుడు. నాచోరే నాచోరే సాంగ్‌లో ఎన్టీఆర్‌తో చిందులేసిన రంభ.. దేశ ముదురు సినిమాలో బన్నీతో స్టెప్పులేసింది.

ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దాదాపుగా దూరమైపోయింది రంభ. ప్రస్తుతం రంభ తన భర్త పిల్లలతో కెనడాలో నివాసం ఉంటోంది. అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తు ఉంటుంది. ఇప్పటికీ ప్రభాస్, మహేష్ తో సినిమాలు చేయాలని ఉందని రంభ చెప్పుకొచ్చారు. నేను చేసిన ఐటమ్ సాంగ్స్ లో నాచోరే నాచోరే సాంగ్ అంటే ఇష్టమని ఆ సాంగ్ కు కష్టపడింది ఎన్టీఆర్ అయితే పేరు మాత్రం నాకొచ్చిందని ఆమె తెలిపారు.

allroudadda
allroudadda

నా దృష్టిలో (Actress Rambha) జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అని కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా అంటే ఇష్టమని రంభ అన్నారు. ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తే కన్నార్పకుండా చూస్తామని ఆమె చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ డెడికేషన్ చూస్తే పిచ్చెక్కుతుందని ఆమె తెలిపారు.

నిద్ర లేవగానే స్మోక్ చేస్తున్నారా..అయితే మీరు ప్రాణాలు డేంజర్?

మైఖేల్ జాక్సన్ వచ్చినా పరవాలేదని నా దృష్టిలో ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అని రంభ కామెంట్లు చేశారు.సినిమాల్లోకి రాకుండా ఉండి ఉంటే పెళ్లి చేసి పంపించేవాళ్లమని పేరెంట్స్ అన్నారని ఆమె తెలిపారు. నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టమని రంభ చెప్పుకొచ్చారు. బండిలో ఉండే ఐస్ క్రీమ్ నాకు ఇష్టమని స్టిక్ ఉన్న ఐస్ క్రీమ్ చాలా ఇష్టమని రంభ కామెంట్లు చేశారు. సాయిబాబాను నేను ఎంతగానో నమ్ముతానని రంభ వెల్లడించడం గమనార్హం.

Recent Posts

Leave a Reply