రానా పక్కన ఉన్న వాళ్ళు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే,

రానా, మిహికాలు వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. తాజాగా ఈ దంపతులు ఇద్దరు బంటీ బజాజ్ ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు. గత ఏడాది ఆగస్ట్ 8న వేదమంత్రాల సాక్షిగా ప్రియురాలు మిహికా బజాజ్‌ని పెళ్లాడిన విషయం తెలిసిందే. కరోనా వలన పెళ్లి వేడుకను కొద్ది మంది సన్నిహితులు, బంధువులు సమక్షంలో జరిపించారు. అయితే మిహికా దగ్గర రానా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి మే 12కి సరిగ్గా ఏడాది గడిచిందట. ఈ సందర్భంగా రానా గతంలో షేర్‌ చేసిన పోస్టును మరోసారి అభిమానులతో పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మిహికా బజాజ్‌. “అతను అడిగాడు నేను ఓకే అన్నా.

నా జీవితంలో తీసుకున్న అత్యుత్తుమ నిర్ణయం ఇదే.ఇది జరిగి ఏడాది అవుతుందంటే నమ్మలేకపోతున్నాను అని మిహికా పేర్కొంది.రానా, మిహికాలు వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. తాజాగా ఈ దంపతులు ఇద్దరు బంటీ బజాజ్ ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు. బంటీ బజాజ్ రానా అత్తగారు కాగా, గురువారం ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా రానా అత్తారింటికి వెళ్లారు. అల్లుడి రాకతో ఆనందించిన బంటి ఫ్యామిలీతో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. ‘నా పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా చేసిన నా కుటుంబానికి కృతజ్ఞతలు” అని పేర్కొంది.

పెళ్లి తర్వాత మిహికతో ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తూనే సినిమాల జోష్ పెంచారు దగ్గుబాటి రానా. ప్రస్తుతం ఆయన ”విరాటపర్వం, పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌లో నటిస్తున్నారు.అలాగే తాజాగా రానా తన మంచి మనుసును చాటుకున్నాడు. కరోనా టైమ్‌లో ఆదివాసీలకు అండగా నిలిచి నిజమైన హీరో అనిపించుకున్నాడు. నిర్మల్ జిల్లాలోని దాదాపు 400 ఆదివాసీ కుటుంబాలకు కావాల్సిన నిత్యావసరాలు, అవసరమైన సామాగ్రిని రానా అందించడం విశేషం.

నిర్మల్ జిల్లాలోని అల్లంపల్లి, బాబా నాయక్ రన్‌‌దా గ్రామ పంచాయతీల్లోని గుర్రం మధిర, పాలరేగడి, అడ్డాల తిమ్మాపూర్, చింతగూడెం, గొంగురం గూడతోపాటు కడెం మండలానికి సాయం అందించాడు. ఆయా గ్రామాలు, గూడెంల్లోని ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలతోపాటు మెడిసిన్స్, గ్రాసరీస్‌ను అందించాడు. ఇక, సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విరాట పర్వం మూవీతోపాటు పవన్ కల్యాణ్‌తో కలసి నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌ పనుల్లో రానా బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత మిలింద్ రావు దర్శకత్వంలో భారీ వీఎఫ్‌ఎక్స్‌ దృ‌శ్యాలతో కూడిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీకి ఓకే చెప్పాడు.