Ranbir Kapoor

Ranbir Kapoor | యానిమల్ కోసం జిమ్‌లో ర‌ణ్‌బీర్.. తప్పక చూడాల్సిన వీడియో..

Ranbir Kapoor | యానిమల్ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‍బాస్టర్ కొట్టారు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. డిసెంబర్ 1న రిలీజైన యానిమల్ ఇప్పటికే రూ.700కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే, యానిమల్ సినిమా తర్వాత యాక్టింగ్‍కు చిన్న బ్రేక్ తీసుకుంటున్నారు రణ్‍బీర్. తదుపరి రామాయణం సినిమాలో ఆయన నటించనున్నారు.

మహా ఇతిహాసం రామాయణం ఆధారంగా సినిమాను రూపొందించనున్నారు బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి నటించనున్నారు. రావణుడి పాత్ర పోషించనున్నారు కేజీఎఫ్ ఫేమ్ యశ్. దంగల్ సహా చాలా సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన మనీశ్ తివారీ.. రామాయణం మూవీకి దర్శకత్వం వహించనున్నారు.

Ranbir Kapoor | జిమ్‌లో ర‌ణ్‌బీర్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు

Ranbir Kapoor
Ranbir Kapoor

కాగా, ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందో తాజాగా సమాచారం బయటికి వచ్చింది.2024 వేసవిలో రామాయణం చిత్రీకరణ మొదలవుతుందని మూవీ వర్గాల నుంచి సమాచారం వెల్లడైంది. అది పక్కన పెడితే అయితే ఈ సినిమా కోసం ర‌ణ్‌బీర్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. పాత్ర‌కి త‌గ్గ‌ట్టు త‌న బాడీని మ‌ర‌ల్చ‌డానికి జిమ్‌లో ఎంతో వ‌ర్క‌వుట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Leave a Reply