Rashmi Gautam |Person | బిజినెస్ మ్యాన్ తో రష్మి పెళ్లి ఫిక్స్.. షాక్ లో సుధీర్..

allroudadda

Rashmi Gautam | తెలుగులో ఎంతగానో అలరిస్తున్న బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే యాంకర్లు కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అందులో ముఖ్యంగా యాంకర్ అనసూయ జబర్దస్త్ ద్వారా ఎంతో పెద్ద గుర్తింపు సంపాదించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. యాంకర్ అనసూయ అంతకుముందే సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఆమె మాత్రం జబర్దస్త్ ద్వారానే చాలా మంచి గుర్తింపు తెచ్చుకుందని పక్కాగా చెప్పొచ్చు.

ఇదే విధంగా రష్మి కూడా గతంలో సినిమాల్లో చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పటికీ జబర్దస్త్ ద్వారానే స్టార్ యాంకర్ గా ఎదిగింది.హీరోయిన్లలో తగలదన్నే ఫాలోయింగ్ సోషల్ మీడియాలో దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.అలాంటి రష్మి గౌతమ్ జబర్దస్త్ లో స్టార్ యాంకర్ గా మారిన తర్వాత సినిమాలలో హీరోయిన్గా కూడా అవకాశాలు అందాయి. ఒక్క బుల్లితెర పైన అల్లరి చేస్తున్న రష్మీ సుధీర్ ల జోడి కి ఓ రేంజ్ లో గుర్తింపు వచ్చింది.

allroudadda
allroudadda

Rashmi Gautam | వెండితెరలో ప్రభాస్ అనుష్కల జంటలకు ఎంత మంచి గుర్తింపు అయితే ఉందో.. అలాంటి గుర్తింపు బుల్లితెర పైన దక్కింది మాత్రం సుధీర్ రష్మీ ల జోడి కి మాత్రమే అని చెప్పాలి. తాజాగా ఈటీవీ లో రష్మీ పెళ్లి పార్టీ అని ఒక ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు రష్మీ.. తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. అతను మన దేశానికి చెందినవాడు కాదు. విదేశీయుడు అని తెలుస్తోంది.

వెక్కివెక్కి ఏడ్చిన విశాల్.. కారణం ఇదే..

ప్రతి అమ్మాయికి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలని ఇమాజినేషన్స్ ఉంటాయి. నా ఇమాజినేషన్ లో ఉన్న వ్యక్తి ఇతనే అని రష్మీ చెప్పుకొచ్చింది. వీరి జంట కూడా చూడముచ్చటగా ఉంది. అయితే ఇది కేవలం ఈవెంట్ కోసమే అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇదే నిజమైతే సుధీర్ పరిస్థితి ఏంటో అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది రష్మీనే బయటపెట్టాలి.

Leave a Reply