Rayapati Aruna | రోజా రెడ్డి నీ బ్రతుకు మొత్తం మెగా చేతిలో ఉంది.. రాయ‌పాటి అరుణ.

Rayapati Aruna | ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు ర‌చ్చగా మారుతున్న క్ర‌మంలో ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. రీసెంట్‌గా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ.. రోజాపై దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న‌ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సంఘాలు, వివిధ పార్టీలు, సామాన్యులు బండారు చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తప్పుబట్టారు.

రోజాకు మద్దతుగా తన ఎక్స్ ఖాతాలో వీడియోను రిలీజ్ చేస్తూ… ఒక మహిళపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.సత్యనారాయణ లాంటి రాజకీయ నాయకుడిని చూసి తాను సిగ్గుపడుతున్నట్లు రాధిక వెల్లడించారు. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు సుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాకు మద్దతు ప్రకటించారు. బంగారు స‌త్యనారాయ‌ణ వ్యాఖ్య‌ల‌ని త‌ప్పు ప‌డుతూ రోజా చేసిన కామెంట్స్ కి రోజా స్పందిస్తూ..

రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా.. చివరికి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల భయపడబోమని.. ఇలా మాటలతో హింసించడం సిగ్గు చేటన్నారు. బండారు సత్యనారాయణ వెంటనే క్షమాపణలు చెప్పి ఆయన గౌరవాన్ని కాపాడుకోవాలి అన్నారు.అలాగే దీనిపై జనసేన అధికార ప్రతినిది రాయపాటి అరుణ కూడా స్పందించారు గతంలో పవన్ భార్యని అన్నపుడు ఏమైంది నిజం చెప్పాలి అంటే రోజా నీ P**N ఫిలిం మా దగ్గరే ఉంది.. నేను కూడా బయట పెట్టమంటావా అంటూ అరుణ ఫైర్ అయింది,

Leave a Reply