Chaitanya Master: చైతన్య మాస్టర్ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం చెప్పిన ఫ్రెండ్..!

ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ప్రస్తుత ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. చైతన్య మాస్టర్ ఆత్మహత్య గురించి తెలిసినంతనే హైదరాబాద్ నుంచి పలువురు నెల్లూరుకు చేరుకున్నారు. ఈయన సూసైడ్ చేసుకొని చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో ద్వారా తన సూసైడ్ కు గల కారణాలను తెలియజేశాడు. అయితే ఢీ కొరియోగ్రాఫర్ గా సుపరిచితులైన చైతన్య మాస్టర్ ఆత్మహత్య వెనుక డబ్బు కారణం కాదన్న మాట వినిపిస్తోంది. తన తల్లిదండ్రులకు, స్నేహితులకు.. తోటి డాన్సర్‌లకు సారీ చెప్తూ.. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతోనే తనువు చాలిస్తున్నట్టు వీడియో లో తెలిపాడు.

కానీ, ఈ డబ్బు ఒక్కట్టే ప్రాబ్లెమ్ కాదని చైతన్య స్నేహితుడు తెలిపడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.శనివారం నెల్లూరులో కళాంజలి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చేతుల మీదుగా చైతన్యకు సన్మానం జరిగింది. చైతన్య స్వస్థలం నెల్లూరు జిల్లా కావటికి దగ్గర్లోని మట్టువారి పాలెం. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి.. డాన్సు మీద మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు.. ఢీ షోతో పాపులర్ అయ్యారు.తాను ఆత్మహత్య చేసుకోవటానికి ముందు.. ఆ విషయాన్ని సెల్ఫీ వీడియోతో అందరికి పంచుకున్న అతను.. కాసేపటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో తానుఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పాడు. తల్లిని.. చెల్లిని.. స్నేహితులకు సారీ చెప్పిన అతని మాటల్ని అతను స్నేహితులు అంగీకరించటం లేదు. చైతన్య డబ్బు కోసం ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటున్నారు. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే చైతన్య.. తన రూం మేట్ గా నాలుగేళ్లుగా ఉన్నాడని.. చిన్న సమస్యలు వస్తాయి కానీ ఆత్మహత్య పరిష్కారం కాదని అతని రూమ్మేట్ వాపోయాడు.

రెండు రోజుల క్రితం తాను చైతన్యతో ఫోన్లో మాట్లాడానని.. సరదాగా మాట్లాడుకున్నామని.. తాను బాధ పడుతున్న విషయాన్ని తమకు ఎవరికి చెప్పలేదన్నారు. ఎలారియాక్టుకావాలో తమకే అర్థం కావట్లేదని స్నేహతుడు పండు వ్యాఖ్యానించాడు. జీవితం అంటే ఎలా ఉండాలన్న దానిపై చైతన్య మాస్టర్ కు స్పష్టమైన అవగాహన ఉందని.. పది మందికి చెప్పేవాడు ఆర్థిక సమస్యలని చెప్పి ఆత్మహత్య చేసుకోవటాన్ని తాను నమ్మట్లేదని చైతన్య స్నేహతుడు ఒకరు వ్యాఖ్యానించారు.ఢీ సీజన్ లో గెలుపు కాస్తలో తప్పిపోయిందని.. అది మిస్ కావటంతోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Leave a Reply