Nagarjuna: ఆ హీరోయిన్ మీద నాగార్జున నిజంగానే ఆశ పడడ్డా..!

టాలీవుడ్ లో ఎప్పటి నుంచో హీరోహీరోయిన్ల మధ్య అలాంటి సంబంధాన్ని సృష్టిస్తూ వస్తున్నారు చాలామంది. ఏది లేకపోయినా ఏదో ఉందని సృష్టించడంలో ఈజీగా సక్సెస్ అవుతున్నారు వీరు. దానికి కారణం సినిమా నటుల మీద ప్రేక్షకులకు ఉన్న అభిప్రాయం. నిజానికి వారికి కూడా సినిమా నటుల మీద ఎలాంటి అభిప్రాయం ఉందో అందరికీ తెలిసిందే.

కానీ అందరి మామూలు మనుషులు లాగానే వీరికి కూడా ఒక మనసు ఉంటుంది. వీరికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అని ఎందుకు గ్రహించలేకపోతున్నారో కానీ పెళ్లి అయినా కూడా వేరొక హీరోయిన్ తో, వేరే హీరోతో అక్రమ సంబంధాలు అంటగడుతూ వారి కాపురాలను కూల్చేస్తున్నారు.కేవలం సృష్టించిన పుకార్ల కారణంగా ఎంతోమంది హీరోహీరోయిన్ల జీవితాలు నాశనమయ్యాయి.

దానికి బాధ్యులు ఎవరు అంటే ఏం చెప్పగలం. కొంతమంది పైశాచిక ఆనందానికి రెండు జీవితాలు బలి ఇవ్వడం మనం ఎంతో మందిని చూశాం. ఇకపోతే టాలీవుడ్ లో ఎఫైర్ ఉందని ఎక్కువ కాలం గాసిప్ నడిచిన జంట టబు, నాగార్జున. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించిన కారణంగా ఏదో సంబంధం ఉందని నాగార్జున టబు ను ప్రతి సినిమాలో తీసుకుంటున్నారని అప్పట్లో పుకార్లు సృష్టించారు.

వీరిరువురు కలిసి 1995లో సిసింద్రీ, ఆ తర్వాత నిన్నే పెళ్ళాడుతా, ఆ తర్వాత ఆవిడ మా ఆవిడే వంటి మూడు సినిమాల్లో నటించి బెస్ట్ రొమాంటిక్ పెయిర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటికే నాగార్జున కి పెళ్లి కూడా అయ్యింది అయినా కూడా కొంతమంది తమ ఆనందం కోసం ఈ ఇద్దరి మధ్య అkraమ సంబంధం అంటగట్టి వారినీ తీరని మనోవేదనకు గురిచేశారు.

టబు ఇంతవరకు పెళ్లి చేసుకోవడానికి కారణం ఇది కూడా ఒకటి అని చెబుతారు. ఏదేమైనా ఒక నిండు జీవితం ఒంటరిగా అష్టకష్టాలు పడడానికి కారణం ఇలాంటి చెత్త వార్తలు రాసేవారే. ఇప్పటికైనా హీరో హీరోయిన్ల మధ్య పర్సనల్ లైఫ్ అందరిలాగానే నార్మల్ గా ఉంటుందని తెలుసుకుంటే మంచిది.

Leave a Reply