Rama prabha | సీనియర్ నటి రమప్రభ అల్లుడు టాలీవుడ్ స్టార్ హీరో అని తెలుసా..

allroudadda

Rama prabha | తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటి అయిన రమాప్రభ ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఆ తరంలో హాస్యనటీమ‌ణులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆమె హీరోయిన్‌గా… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా త‌న‌దైన ముద్ర వేశారు. హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించిన‌ రాజబాబు – రమాప్రభ కాంబినేషన్ అంటే అప్పట్లో ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉండేదో తెలిసిందే. వీరిద్దరూ కలిసి పండించే హాస్యం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేది. అప్పట్లో వీరి కాంబినేషన్‌కు చాలా డిమాండ్ ఉండేది.

అలాగే ర‌మ ప్రభ అల్లు రామలింగయ్య, రమణారెడ్డి లాంటి గొప్ప హాస్య నటులతో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు హృదయాల్లో నిలిచిపోయారు.అలాగే మరో సీనియర్ కమెడియన్ రేలంగి పక్కన కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్రల‌లో కనిపించారు. ఇక రమాప్రభ సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న సమయంలోనే సినీ హీరో శరత్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

 Rama prabha | నటి రమప్రభ అల్లుడు..

13 సంవత్సరాల పాటు కలిసి జీవించిన వీరిద్దరూ ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇంకా చెప్పాలంటే శరత్ బాబు కంటే వయసులో ర‌మాప్ర‌భ‌ పెద్దది కావడం విశేషం. షూటింగ్‌లు జరుగుతున్నప్పుడు మాత్రమే బయటికి వచ్చే రమాప్రభ మిగిలిన సమయాల్లో మదనపల్లె దాటి బయటకు రారు. ఇలా ఉండగా.. ఈమె అల్లుడు ఎవరు అన్న సంగతి ఇప్పటి వరకూ చాలా మందికి తెలిసి ఉండదు. ఆ విషయం తెలుస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.!

ఒక్క గంట పూజకు వేణు స్వామి పారితోషికం ఎన్ని లక్షలో తెలుసా..

allroudadda
allroudadda

అతనెవరో కాదు.. మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారే..! వివరాల్లోకి వెళితే..రమ ప్రభ తన అక్క కూతురు అయిన విజయ చాముండేశ్వరిని ఎప్పుడో దత్తత తీసుకుందట.ఈమెనే రాజేంద్ర ప్రసాద్ కు ఇచ్చి పెళ్లి చేసిందట. ఈ విషయాల్ని రమ ప్రభనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాదు ‘మా అసోసియేషన్’ వల్ల ఈమె ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొందట. తన అల్లుడు రాజేంద్ర ప్రసాద్.. ‘మా అసోసియేషన్’ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ అవమానాలు ఫేస్ చెయ్యాల్సి వచ్చినట్టు కూడా చెప్పి కంటతడి పెట్టుకుంది రమప్రభ .

నా జోలికొస్తే.. దూల తీరుస్తా అంటున్న యాంకర్ అనసూయ

Leave a Reply