అల్లు అర్జున్‌తో ఉన్న… ఈ స్టార్ “హీరోయిన్” ఎవరో గుర్తుపట్టారా?

రాఘవేంద్రరావు దర్శకత్వంలో రిలీజ్ అయి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం గంగోత్రి. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ ను తెలుగు తెరకు హీరోగా అరంగేట్రం చేశాడు. అయితే ఈ చిత్రం రిలీజ్ అయి ఇప్పటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో కలిసి నటించిన హీరోయిన్ ఎవరో మీకు గుర్తుందా…ఆర్తి అగర్వాల్ చెల్లెలు ఆదితి అగర్వాల్ ఈ గంగోత్రి చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించింది.

కానీ ఆ తర్వాత రెండు మూడు చిత్రాలకే పరిమితమైన ఆమె క్రమంగా సినీ పరిశ్రమకు దూరమైంది. ఆమె అక్క ఆర్తి అగర్వాల్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ క్రమంలో 2016లో చివరిసారిగా లవ్ హాయ్ యార్ అక్సెప్ట్ ఇట్ అనే సినిమాలో నటించిన ఆమె తరువాత తిరిగి కనిపించలేదు. ఫ్యామిలీ తో పాటు విదేశాల్లో స్థిరపడిన అదితి 35 ఏళ్లు వయసు వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోలేదు.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఫోటోలు పోస్ట్ చేస్తూ అదితి యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తో కలిసి గంగోత్రి చిత్రం హీరోయిన్ అదితి అగర్వాల్ తీసుకున్న లేటెస్ట్ ఫోటో ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది. గంగోత్రి చిత్రంలో ఆదిత్య అగర్వాల్ ని చూసిన అందరూ ఇప్పుడు ఫోటోలో ఉన్నది ఆమె అంటే నమ్మలేక పోతున్నారు. గ్రే సిల్వర్ స్కర్ట్ మీద బ్లాక్ టాప్ తో అదితి కాలేజీకి వెళ్లే టీనేజర్ లాగా ఉన్నారు.

ఆ ఫోటో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.జబర్దస్త్ యాంకర్ అనుకున్నాను” అని కొందరు, “కొత్త మూవీ హీరోయిన్ అనుకున్నాను” అని మరికొందరు ఇలా ఆమె ఫోటో చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. కొందరైతే గంగోత్రి సినిమాలో అచ్చం అల్లు అర్జున్ లాగా ఉన్న హీరోయిన్ ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఇద్దరు ఒకరేనా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ లను తలదన్నేలా తయారైన అదితి త్వరలోనే తిరిగి సినీ ఫీల్డ్ లోకి రీ ఎంట్రీ ఇస్తుందా అని అందరూ తమ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply