అకీరా నా కొడుకు పవన్ కి సంబంధం లేదు రేణుదేశాయ్ పోస్ట్..!

సోషల్ మీడియాలో అకీరా నందన్ ఫొటోలను పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఆమె పోస్టు చేసిన చాలా ఫొటోలు, వీడియోల్లో అకీరా మొఖం కనిపించదు. అకీరా పుట్టిన రోజున కూడా రేణు షేర్ చేసిన అకీరా వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో అకీరా కనిపించకపోవడంపై పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. దాంతో రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. ఏప్రిల్ 8వ తేదీ అకీరా నంద‌న్ 19వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ అకీరా నంద‌న్ పుట్టిన‌రోజున సోష‌ల్ మీడియా ద్వారా విషెష్ చెప్పారు. అకీరా నంద‌న్ ను త్వ‌ర‌లోనే సినిమా రంగంలో చూడాల‌ని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే, అకీరా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఓ నెటిజ‌న్ హద్దు దాటి ప్రవర్తించాడు. దీంతో తన స్టైల్ లో రిప్లై ఇచ్చారు రేణు దేశాయ్. “మేడమ్. ఇది చాలా అన్యాయం. మా అకీరాను ఒక్కసారి అయినా చూపించండి. మా అన్న కొడుకును చూడాలని మాకు ఉంటుంది.

మీరు హైడ్ చేయకండి. అప్పుడప్పుడు అయినా వీడియోస్ లలో అకీరా బాబును చూపించండి” అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. దీనికి “మీ అన్న కొడుకు?? అకీరా నా అబ్బాయి. మీరు ఒక తల్లికి పుట్టలేదా. మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని నేను అర్థం చేసుకోగలను. కానీ, కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. నేను ఇలాంటి మెసేజ్ లను చాలా ఇగ్నోర్ చేస్తా. కానీ కొంతమంది మాత్రం హద్దుదాటి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు” అని తెలిపింది రేణు దేశాయ్.

Leave a Reply