Renu Desai | త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న రేణు దేశాయ్? వరుడు ఎవరంటే,

Renu Desai

Renu Desai | పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాల గురించి మరియు పిల్లల గురించి పోస్టులు పెడుతూ తనకి అండగా ఉండేవారికి స్నేహితులకు తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తుంది. ఇటువంటి క్రమంలో త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న రేణు దేశాయ్ తాజాగా ఇటీవల ఫేస్బుక్ పేజీలో పెట్టిన ఒక కవిత లాంటి ఫోటో గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు..

అదేమిటంటే రేణు దేశాయ్ పెట్టిన కవితకి అర్థం రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడం లేదని తాను ఇంకా పవన్ కళ్యాణ్ ప్రేమలో మునిగి తేలుతుందని కామెంట్ చేస్తున్నారు.
ఇంతకీ అసలు రేణుదేశాయ్ పెట్టిన కవిత ఏంటో ఒక సారి చూద్దాం..‘‘ప్రేమను మళ్లీ నేర్చుకోవడం సాద్యమేనా?’’.. ‘‘మొదటి సారి ప్రేమలో పడ్డప్పుడు వచ్చిన నవ్వు ఇప్పుడు వస్తుందా?’’.. ‘‘ఒకసారి అద్దంలో మొహం చూసుకుంటే మీరు కోల్పోయింది ఏంటో మీకే అర్థం అవుతుంది’’.. ‘‘నిద్ర లేని రాత్రులు గడిపే వారికి వారి ప్రేమ గురించి తెలుస్తుంది’’ అంటూ వైరాగ్యం నిండిన మాటలతో ఈ కవితను నింపేసింది.

Renu Desai | రెండో పెళ్లి చేసుకోబోతున్న రేణు దేశాయ్

అది పక్కన పెడితే రవితేజ తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’లో రేణు దేశాయ్ కూడా నటించారు. ఈ నెల 20న ఆ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ… ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… తన రెండో పెళ్లి గురించి మాట్లాడారు. పవన్ నుంచి తాను విడిపోయే సమయానికి అకీరా, ఆద్య చిన్న పిల్లలని రేణు తెలిపారు. రెండో పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు చెపుతుండేవారని వెల్లడించారు.

Also Read : విడాకుల తర్వాత మరింత ఎంజాయ్ చేస్తున్న మెగా డాటర్..

కొంత కాలం తర్వాత రెండో పెళ్లికి అంగీకరించానని… నిశ్చితార్థం కూడా జరిగిందని తెలిపారు. అప్పుడు ఆద్య వయసు ఏడేళ్లని… పెళ్లి చేసుకుంటే ఆయనతో పాటు ఆద్యకు కూడా సమయం కేటాయించాల్సి ఉంటుందని… అది చాలా కష్టమనిపించిందని చెప్పారు. అందుకే రెండో పెళ్లిని రద్దు చేసుకున్నానని తెలిపారు. ఎవరైనా ఒక వ్యక్తి నచ్చితే, ఆయనతో సుఖంగా ఉంటావు అనిపిస్తే పెళ్లి చేసుకోమని అకీరా తనకు చెపుతుంటాడని అన్నారు. మరో రెండు, మూడు ఏళ్ల తర్వాత రెండో పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Leave a Reply