చివరికి రఘువరన్ చనిపోవడానికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే,

సన్నగా పొడుగ్గా కళ్లాద్దాల చాటు మేధావితనంతో కనిపించే రఘువరన్‌ విలక్షణ విలన్‌. మంచి క్యారెక్టర్​ ఆర్టిస్ట్‌. ఎప్పుడూ హుందాగా ఉండే ఆయనదో ప్రత్యేకమైన నటనశైలి, విభిన్నస్వరం, వైవిధ్యమైన ఉచ్చారణ. ఈ లక్షణాలతోనే ఆయన తెరని ఏలారు. ఎన్నో పాత్రలకు ప్రతిభ అద్దారు. మరీ ప్రత్యేకించి ప్రతినాయకుడి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలన్నింటిలో కలిపి 200 సినిమాలకు పైగా నటించి అభిమానులను అలరించారు. కేరళ రాష్ట్రం కోలెంగూడె ప్రాంతంలో వేలాయుధన్, కస్తూరి దంపతులకు పెద్దకుమారుడు రఘువరన్‌.

ఈయన తాత పేరు ఎన్‌.రాధాకృష్ణ నాయర్‌. ఆయన హోటల్‌ వ్యాపారాన్ని కోయింబత్తూర్‌కు తండ్రి మార్చడం వల్ల కుటుంబం అక్కడకు వలస వచ్చింది. దాంతో, అక్కడే సెయింట్‌ ఆన్స్‌ మెట్రిక్యులేషన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు‌. ఆపై లండన్‌ ట్రినిటీ కళాశాలలో పియానో నేర్చుకున్నారు.కోయంబత్తూర్ గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌లో హిస్టరీలో బాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చేరారు. అయితే, నటనను వృత్తిగా ఎంచుకోవాలన్న ఆలోచనతో చదువును కొనసాగించలేకపోయారు. మొదటగా కన్నడ భాషలో ఓ సినిమాలో చిన్న పాత్రలో మెరిశారు. అలాగే, తెలుగులో కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశారు. అలా అంచెలంచెలుగా ఎదిగారు.

1979 నుంచి 1983 వరకు, చెన్నైలోని యాక్టింగ్‌ డ్రామా ట్రూప్‌ చెన్నై కింగ్స్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందంలోనే కన్నడ, తమిళ భాషలలో సహాయక నటుడు పాత్రలు పోషించే నాజర్‌ కూడా అప్పుడే సభ్యుడిగా ఉండేవారు. 1986లో మిస్టర్ భరత్ అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత చైతన్య, న్యాయానికి సంకెళ్ళు, పసివాడి ప్రాణం, జేబుదొంగ, కాంచన సీత, శివ, అంజలి ,కిల్లర్, ప్రేమికుడు, ముత్తు, ఎవడైతే నాకేంటి, ఒకే ఒక్కడు , రక్షకుడు, అరుణాచలం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

ఇలా తెలుగు ,తమిళ్ ,కన్నడ, మలయాళం భాషలలో సుమారు 150 చిత్రాలకు పైగా నటించారు.తమిళ, మలయాళం, తెలుగు సినిమాలకు సంబంధించి తన నటనకు గానూ ఎన్నో రాష్ట్ర, ఫిలింఫేర్‌ పురస్కారాలను అందుకున్నారు రఘువరన్‌ఆ తరువాత ఈయన నటి రోహిణి ని పెళ్లి చేసుకొని, వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

ఈయన చివరిసారిగా 2008లో వచ్చిన నితిన్ ఆటాడిస్తా మూవీ తో సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇక ఈయన సినీ కెరీర్లో ఇదే చివరి సినిమా. ఈయన చిత్రాలలో బాగా విజయవంతంగా రాణిస్తున్న సమయంలో ,ఈయన అనుకోని కారణాల చేత మద్యానికి.. మాదకద్రవ్యాలకు .. ఇలా ఎన్నో చెడు అలవాట్లకు బానిస అయ్యారు. ఈయన మద్యానికి బానిస కావడం వల్ల కాలేయం కూడా చెడిపోయింది. మార్చి- 19 – 2008 లో చెన్నై లో గాఢనిద్రలో ఉన్నట్టుగానే గుండెపోటుతో మరణించారు.