Revanth Reddy | నిన్ను నీ అయ్యను, నీ బావను బొందపెట్టి కుర్చీలో పెడతా… రేవంత్ ఫైర్

allroudadda

Revanth Reddy | భారాస అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. బిడ్డా.. సన్నాసి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేవెళ్లలో జన జాతర పేరుతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ‘రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించు బిడ్డా… నువ్వు వస్తావా? నీ అయ్య వస్తాడా? చూసుకుంటాం బిడ్డా’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తాను తాత, తండ్రి పేరు చెప్పుకొని పైకి రాలేదని.. అవినీతి పరులను, దుర్మార్గులను తొక్కుకుంటూ పైకి వచ్చానంటూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. చేవెళ్ల సభ నుంచి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. “దమ్ముంటే, మొగోడివైతే.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించు.. నీఅయ్యా నువ్వు వస్తావో.. నీ అయ్యా వస్తాడో రమ్మను.. మా కార్యకర్తలు చూసుకుంటారు.” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.“ప్రభుత్వం కూలిపోతుంది అని ఎవరైనా అంటే.. వాళ్లను గ్రామాల్లో కార్యకర్తలు చెట్టుకు కట్టేసి కొడతారు. అల్లాటప్పా గాళ్లం కాదు.. సీఎం అయ్య పేరు చెప్పుకుని కుర్చీలో కూర్చోలేదు.

నీ బావను బొందపెట్టి.. ఈ కుర్చీలో కూర్చున్నాం…

allroudadda
allroudadda

కార్యకర్త స్థాయి నుంచి జెండాలు మోసి పోరాటాలు చేసి.. లాఠీ దెబ్బలు తిని.. అక్రమ కేసులు ఎదుర్కొని.. చంచల్ గూడా, చర్లపల్లి జైలులో మగ్గినా తలొంచకుండా నిటారుగా నిలబడి.. నిన్ను నీ అయ్యను, నీ బావను బొందపెట్టి.. ఈ కుర్చీలో కూర్చున్నాం.” అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.ఈ రోజు ఆ కుర్చీ తనకు ఉందంటే అది కార్యకర్తల త్యాగం… పోరాట ఫలితమే అన్నారు. ఈ కార్యకర్తలు తనను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు… నువ్వు పుట్టించిన నీ అయ్య కూడా కాదు…

YS Jagan | రేవంత్ రెడ్డి కి జగన్ మాస్ వార్నింగ్ ..!

వాళ్ల దేవుడు వచ్చినా ఆ కుర్చీని మీరు తాకలేరని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియా ఉంటే మేం గెలిచేవాళ్లమని కేటీఆర్ అంటున్నారని… కానీ ఉన్న టీవీలు అన్నీ ఆ సన్నాసి సుట్టపోల్లవే అని ఘాటుగా విమర్శించారు. మాకు ఏమైనా టీవీ ఉందా? పేపర్ ఉందా? సాయంత్రం సేద తీరేందుకు జుబ్లీహిల్స్‌లో సినిమా వాళ్ల గెస్ట్ హౌస్ ఉందా? అని కేటీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మా కార్యకర్తల కష్టఫలంతో… వారు నిలబడి కొట్లాడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పులను తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారని వెల్లడించారు.

Leave a Reply