CM Revanth Reddy | అసెంబ్లీలో రేవంత్ రెడ్డి విశ్వరూపం.

allroudadda

CM Revanth Reddy | తెలంగాణ అసెంబ్లీలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షం BRSపై మరోసారి విరుచుకుపడ్డారు. నీటిపారుదల అంశానికి సంబంధించి విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. “గోదావరి ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజనీర్లతో ఆనాటి సీఎం కేసీఆర్, ఆనాటి మంత్రి హరీష్ రావు ఒక కమిటీ వేశారు. ఐదుగురు సభ్యుల కమిటీ 14పేజీల నివేదిక ఇచ్చింది. జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పి సహకరిస్తే హరీష్‌ గౌరవం ఉండేది.

కానీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. మాట్లాడితే గతంలో గతంలో అని మాట్లాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విషయాలను మీకు గుర్తు చేస్తున్నా” అంటూ సీఎం రేవంత్ స్పీచ్ ఇచ్చారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే తప్పుల తడక అంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పులను ఒప్పుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

allroudadda
allroudadda

కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం గత కేసీఆర్ ప్రభుత్వం పట్టుపట్టలేదని.. అందువల్లే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఓంపీలు వచ్చాయని మండిపడ్డారు. కేసీఆర్‌ విధానాల వల్లే హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

allroudadda
allroudadda

మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టాలన్నది కేసీఆర్ ఆలోచనే అన్నారు.ప్రాణహిత ప్రాజెక్ట్ చేవెళ్లకు మారడానికి కారణం చెల్లెమ్మ సబితా కాదా అని ప్రశ్నించారు. తమ్ముడు హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతుంటే చేవెళ్ల చెల్లెమ్మ సరిదిద్దొద్దా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావును నిలదీస్తున్నా మీరు కాదా కాళేశ్వరం దుర్గార్గాలకు బాధ్యులు అని ఫైర్ అయ్యారు.

Leave a Reply