RGV | నాకు ఆతొడలు కావాలని అడిగిన RGV…!!

RGV

RGV | ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల దిశ, దశల్ని మార్చిన లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కానీ ఇప్పుడీ దర్శకుడు పబ్లిసిటీ దిశ, దశల్ని మార్చేస్తున్నాడు. ఏ టైమ్ లో ఎలాంటి గోల చేస్తే పబ్లిసిటీ పీక్ లెవెల్లో వస్తుందో .. ఏ న్యూస్ ను ఎంత మోతాదులో వివాదాస్పదంగా మార్చాలో ఆయనకి తెలిసినంత గా ఎవరికీ తెలియదు. అంతేకాదు .. సోషల్ మీడియాను తనకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలో కూడా ఆయనకి కొట్టిన పిండి, చెయితిరిగిన చిత్రకారుడు.

ఇటీవల వర్మ .. బిగ్ బాస్ ఫేమ్ అరియానా తో ఒక జిమ్ ఫోటోను పోస్ట్ చేసి మంచి అప్లాజ్ పొందిన ఆయన.. అంతలోనే తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక వివాదాస్పదమైన హాట్ పిక్ ను పోస్ట్ చేసి దానికి ఓ కేప్షన్ కూడా ఇచ్చేశాడు. ఆ పిక్ ఏంటయ్యా అంటే.. సోనియా నరేశ్ అనే ఓ వర్దమాన నటీమణి తొడల్ని తమకంగా ముద్దుపెట్టుకుంటూండగా తీసిన ఫోటో ను పోస్ట్ చేశాడు. ఆ పిక్ ను డేంజరస్ హీరోయిన్ నైనా గంగూలీ క్లిక్ మనిపించడం విశేషం.

RGV
RGV

వర్మ తన ఫోటో తో పాటు .. నేను , సోనియా నరేశ్ తొడలు.. ఫోటో తీసింది నైనా గంగూలి. సోనియా నరేశ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ తో పాటు టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్ కూడా అంటూ ఓ కేప్షన్ కూడా ఇచ్చేశాడు. ఈ ఫోటోకి బోలెడన్ని విమర్శలు వస్తున్నప్పటికీ.. రామ్ గోపాల్ వర్మ అభిమానులు మాత్రం .. అంత డేరింగ్ ఫోటోలు పోస్ట్ చేయడం ఆయనకే సాధ్యం.. ఆయన్న ఈ విషయంలో ఎవరూ బీట్ చేయలేరు అంటున్నారు. ఎంతైనా వర్మ వర్మే.

Recent Posts

Leave a Reply