Roja Daughter | దయచేసి మా అమ్మను వదిలేయండి..ఆమె బంగారం.,,

Roja Daughter | గత కొద్ది రోజుల నుంచి సినీనటి రోజా పైన పలువురు టిడిపి నేతలు సైతం అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టిడిపి నేత బండారు సత్యనారాయణ దారుణమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా మహిళలను ఇలా దూషించి మాట్లాడడంతో ప్రతి ఒక్కరు కూడా ఈయన పైన ఫైర్ అవుతున్నారు.. ఓ మహిళా మంత్రి పైనా బండారు చేసిన వ్యాఖ్యలు చాలా దిగజారుడుతనానికి నిదర్శనంగా ఉన్నాయని మహిళలను గౌరవించేవారు ఎవరు కూడా ఇలా మాట్లాడరంటూ పలువురు కార్యకర్తలు సినీ ప్రముఖులు కూడా ఫైర్ అవుతున్నారు.

అయితే ఈ విషయం పైన తాజాగా సినీనటి ఖుష్బూ కూడా స్పందిస్తూ తన మద్దతు రోజాకే ఉందంటూ ప్రకటించడం జరిగింది. బండారు తక్షణమే ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పేదాకా పోరాటం ఆగుతూనే ఉంటుందని తెలియజేస్తోంది. మహిళల కోసం రిజర్వేషన్ల బిల్లు ప్రధాని మోడీ తెచ్చారని మహిళా సారధి కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వ్యక్తి ఇలా మహిళా నేతలపైన మాట్లాడడం చాలా దారుణంగా ఉందంటూ కుష్బూ ఆవేదనని వ్యక్తం చేస్తోంది.

తాజాగా రోజా విషయంపై తన కూతురు కూడా స్పందించినట్టు తెలుస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మను ఇప్పుడు ఇలా చూస్తే ఏడుపొస్తుంది. తన తల్లిని వదిలేయండి.. అంటూ కుటుంబ సభ్యుల ముందు వాపోయిందట రోజా కూతురు. నేను చిన్నపిల్లను.. అమ్మను ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఎప్పుడూ అమ్మను అలా చూడలేదు. అమ్మ అలా దిగులుగా ఉంటే నాకు భోజనం కూడా తినాలనిపించడం లేదు.. అంటూ రోజా కూతురు వాపోయినట్టు తెలుస్తోంది.

Leave a Reply