Minister Roja | గడప ముందుకొచ్చిన రోజాతో ఈ తాత చేసిన పనికి అంతా షాక్..

Minister Roja | ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ఎన్నికలకు రెండుళ్లకు పైగా సమయం ఉన్నా..? ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చని విపక్షాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు పొత్తుల విషయంలో దూకుడుగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో అధికార వైసీపీ (YCP) గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Prabutwam) తో.. ప్రజల్లోకి వెళ్తోంది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పటికే నిత్యం ప్రజల్లోకి వెళ్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో (YCP Menifesto) తీసుకుని వెళ్తున్నారు. ఇంత వరకు ప్రభుత్వ పథకాలు ఎన్ని అందాయా..? అర్హత ఉన్న వారందరికీ పథకాలు అందున్నాయా..? ప్రభుత్వ పని తీరు ఎలా ఉంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నారు. అయిత కొన్ని చోట్ల సాధారణంగానే ప్రజలు ఆహ్వానిస్తూ తమ స్యమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కొన్ని చోట్ల మాత్రం నిరసన సెగలు తప్పడం లేదు.ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా పర్యాటక శాఖ మంత్రి రోజా తన నియోజకవర్గం నగరిలో “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓ వృద్ధుడు ఇంటికి వెళ్లి ఆ ఇంటికి వైసీపీ ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఉన్న సమయంలో… ఆ వృద్ధుడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా ప్రతి ఇంటికి మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ నీ వచ్చే ఎన్నికల్లో కూడా ఆదరించాలని..కోరడం జరిగింది.

Leave a Reply