Sadha: సదా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ స్టార్ హీరోనా..?

హీరోయిన్ సదా గుర్తుందా? గుర్తులేదంటే.. ‘రాను రానంటూనే సిన్నదో.. ’ పాట గుర్తుందా. రీసెంట్‌గా ఈ పాటని నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’లో రీమిక్స్ కూడా చేశారు. నితిన్ ‘జయం’ సినిమాలో అమాయకంగా ‘వెళ్లవయ్యా.. వెళ్లు’ అని చెప్పి.. అప్పటి కుర్రకారు గుండెల్లో రోజాలను మొలకెత్తించిన సదా.. శంకర్ ‘అపరిచితుడు’ తర్వాత ఒక్కసారిగా మాయమైంది. అప్పటి వరకు మారుమోగిన సదా పేరు.. ఆ సినిమా తర్వాత నుంచి వినిపించకుండా పోయింది.

అలాగే సదా కూడా కనిపించకుండా పోయింది. మధ్య మధ్యలో రెండు మూడు చిత్రాలలో నటించినా.. ఆమెనెవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత బుల్లితెరపై జడ్జిగా కూడా దర్శనమిచ్చింది.అయితే కెరీర్ ఎలా సాగుతున్న ఆమె వ్యక్తి గత జీవితం మాత్రం చాల క్లీన్ గా ఉంది.ఇక సదా హీరోలతో అఫైర్స్ సాగించే టైపు హీరోయిన్ కాకపోవడం వల్లనే ఆమెకు ఇండస్ట్రీ లో సరైన అవకాశాలు రాలేదు అని కూడా కొందరి అభిప్రాయం.

కాగా జంతు ప్రేమికురాలైన సదా ఆనిమల్ రైట్స్ కోసం పోరాడుతుంది. ఇక ఆమె అనిమల్ సపోర్ట్ చేసే సంస్థలతో కలిసి పని చేస్తుంది.ఇదిలావుంటే ఇక 38 ఏళ్ళ వయసు ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. కెరీర్ లో బిజీ గా లేకపోయినా పెళ్లికి మాత్రం ఆమె ఎప్పుడు నో చెప్తూనే ఉంది.అయితే దానికి కారణం ఆమె కు సరైన వరుడు దొరక్కపోవడమే అని సదా చెప్తున్నా అందుకు ఇంకా వేరే కారణాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఇక సదా సినిమాల్లో బిజీ గా ఉన్న టైం లో ఒక హీరోను ప్రేమించిందని అతడు ఆమెతో పెళ్ళికి నో చెప్పడం తో ఆమె ఇంకా పెళ్లి చేసుకోకూడదని నిరాయించుకున్నట్టు సమాచారం.కాగా ఆ హీరో ఎవ్వరో చెప్పకపోయినా ఇప్పటికి అతడినే సదా ప్రేమిస్తుందట. ఈ దేవదాసి అవతారం చాలించి సదా ఎప్పుడు ఒక ఇంటికి ఇల్లాలు అవుతుందా అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు..!!

Leave a Reply