తనను కాపాడిన వ్యక్తికి సాయి ధరమ్ తేజ్ చేసిన సాయం ఏంటో తెలుసా..!

సాయం చేసి బయటకు చెప్పుకోకపోవటం కొందరికి అలవాటు. అలాంటి పనులెన్నో చేసిన వ్యక్తికే సాయం చేయటం.. అది కూడా ప్రాణాన్ని ఇవ్వటానికి మించింది ఏముంటుంది? సినీ నటుడిగా సుపరిచితుడు మెగా ఫ్యామిలీలో హుషారైన కుర్రాడి మాదిరిగా చెప్పే సాయి ధరమ్ తేజ్ వ్యక్తిత్వం అతడికో ప్లస్ పాయింట్ గా చెబుతుంటారు.ఎవరైనా ఆపదలో ఉన్నారన్నా.. సాయం కోసం ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసినంతనే వెనుకా ముందు చూసుకోకుండా సాయం చేసే కొద్ది మంది టాలీవుడ్ హీరోల్లో తేజ్ ఒకడిగా చెబుతారు.

సరిగ్గా సెప్టెంబరు 10న దుర్గంచెరువు వద్ద బైకు మీద ప్రయాణిస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.తీవ్ర గాయాలు అవ్వడంతో చాలా రోజులు ఆస్పత్రిలో అపస్మారక స్థితిలోనే ఉన్నాడు తేజ్. అప్పట్లో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున పూజలు కూడా చేశారు. డాక్టర్ల కృషి.. ఫ్యాన్స్ పూజలు, పెద్దల ఆశీస్సులు, దేవుడి కటాక్షంతో.. కొన్ని రోజుల తర్వాత క్షేమంగా ఇంటికి వచ్చాడు తేజ్.

ఒక రకంగా చెప్పాలంటే హెల్మెట్ అతడి ప్రాణాలను నిలిపింది. అయితే ప్రమాదం ఎఫెక్ట్ మాత్రం తేజ్‌పై చాలా రోజుల పాటు ఉంది. మాటలు మాట్లేందుకు కొన్ని రోజుల పాటు ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు ఆల్ సెట్. మళ్లీ లు మొదలెట్టేశాడు. విరూపాక్షతో త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ ప్రమోషన్స్‌లో పాల్గొన్న తేజ్ యాక్సిడెంట్ జరిగిన రోజు తనను కాపాడిన వ్యక్తి గురించి కొన్ని వివరాలు పంచుకున్నారు.

యాక్సిడెంట్ జరిగిన రోజు సాయి ధరమ్ తేజ్‌ను ఐడెంటిఫై చేసి.. అతడిని గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లేలా చేసిన వ్యక్తి పేరు సయ్యద్ అబ్ధుల్. కోలుకున్నాక అతడిని కలిసినట్లు సాయి తేజ్ చెప్పాడు. కొంత డబ్బు ఇచ్చి.. ప్రాణం నిలిపిన అతడికి థ్యాంక్స్ చెప్పి పంపలేనని.. అందుకే నంబర్ ఇచ్చి.. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా సంకోచించకుండా కాల్ చేయమని చెప్పినట్లు తేజ్ వివరించాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు పరంగా అతడికి ఏమైనా సాయం చేశారో లేదో తనకు తెలియదని తెలిపాడు. తన మానవత్వానికి డబ్బుతో ముడి కట్టలేనని.. అతడికి సాయం కావాలంటే మాత్రం ఎక్కడివరకు అయినా వెళ్తానని తేజ్ వెల్లడించాడు.

Leave a Reply