Sai Pallavi  | చెల్లి ఎంగేజ్మెంట్ లో సాయి పల్లవి మాస్ డాన్స్ ..!

allroudadda

Sai Pallavi  | తెలుగు ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి. పాత్రకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎల్లప్పుడూ సాంప్రదాయ వస్త్రాలంకారణలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే సాయి పల్లవికి అచ్చం తన లాగే కనిపించే ఒక చెల్లి కూడా ఉన్నారు. ఈమె కూడా కోలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇటీవలే సాయి పల్లవి చెల్లి పూజ కన్నన్ తన కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది.. అలాగే రీసెంట్ గా వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలలో సాయి పల్లవి తో పాటు ఆమె చెల్లెలు కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఆడి పాడి ఎంజాయ్ చేశారు. ఈ ఎంగేజ్మెంట్ నుంచి నిన్న మొన్నటి వరకు ఎన్నో వీడియోలు ఫోటోలు బయటకు రాగా నిన్న పూజా షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.

allroudadda
allroudadda

అయితే ఈసారి ఈ వీడియోలో అక్కని సైడ్ చేసి చెల్లెలు తెగ పాపులర్ అయిపోయింది. మాస్ బీట్ సాంగ్ కి కిర్రాక్ స్టెప్స్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ వీడియోలో సాయి పల్లవి పూజతో పాటు పూజారి కాబోయే భర్త అలానే సాయి పల్లవి ఫ్యామిలీ మొత్తం చెప్పులు వేశారు. నిశ్చితార్థం సందర్భంగా ఫ్యామిలీ మొత్తం కలిసి సరదాగా వేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

 వెంకటేష్ కు కాబోయే అల్లుడు గురించి షాకింగ్ నిజాలు.

పూజ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఈ వీడియో లో ఫుల్ జోష్ తో ఉన్న పెళ్లికూతురు, పెళ్లి కొడుకు తో కలిసి మన సాయి పల్లవి కూడా మాస్ స్టెప్పులు ఇరగదీసింది.కాగా చెల్లి ఎంగేజ్మెంట్ లో కూడా సాయి పల్లవి ఎప్పటిలాగా ఎంతో సింపుల్ గా కనిపించింది. ఎంగేజ్మెంట్ కు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలను పట్టి అక్కచెల్లెళ్ల మధ్య ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతోంది.

Leave a Reply