Sai Pallavi: లవ్‌లెటర్‌ రాసిన సాయి పల్లవి..! ఎవరికో తెలుసా..

సాయిపల్లవి ది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. సాయి పల్లవి వయసు 30 ఏళ్లు. ఇండస్ట్రీకి 12 ఏళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో వచ్చిన ఫిదా సినిమాతో అందర్నీ ఫిదా చేసింది.

అయితే తాజాగా సాయి పల్లవి తన తొలి ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఏడో తరగతిలో తన క్లాస్‌మేట్‌ను ఇష్టపడినట్లు ఓ ఇంటర్యూలో చెప్పింది.ఆమె మాట్లాడుతూ ‘నా ప్రేమను వ్యక్తం చేస్తూ ఆ అబ్బాయికి లవ్‌లెటర్‌ రాశాను.

అయితే దానిని అతడికి ఎలా చేరవేయాలో తెలియక పుస్తకంలో దాచిపెట్టా. అది కాస్త మా అమ్మ కంట పడటంతో నన్ను తీవ్రంగా మందలించింది. ఇక అలాంటి పని చేయనని అమ్మకు మాటిచ్చాను. ఆ సంఘటన తర్వాత అమ్మను బాధపెట్టే పని ఏనాడు చేయలేదు. పిల్లలను సన్మార్గంలో నడిపించే ప్రతి తల్లిని నేను ఆదర్శంగా తీసుకుంటాను’ అని చెప్పింది.

Leave a Reply