అమ్మో సాయి పల్లవి చెల్లి పూజ కన్నన్ డ్యాన్స్ వైరల్ వీడియో చూశారా?

తెలుగు డెబ్యూ ఇవ్వకుండానే టాలీవుడ్లో ఫ్యాన్స్ ను సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. మలయాళం ‘ప్రేమమ్’ లో మలార్ గా ఆమె పలికించిన హావభావాలు మరువలేనివి. అటు తర్వాత ‘ఫిదా’ తో సాయి పల్లవిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు శేఖర్ కమ్ముల గారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం.. అందులో ‘వచ్చిండే’ పాటకు సాయి పల్లవి వేసిన డాన్స్ క్లిక్ అవ్వడంతో ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది.

ఆ తర్వాత ‘ఎం సి ఎ’ ‘లవ్ స్టోరీ’ ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి విజయవంతమైన చిత్రాలతో ఈమె దూసుకుపోతుంది. రానా తో వేణు ఉడుగుల దర్శకత్వంలో ఆమె చేసిన ‘విరాటపర్వం’ మూవీ కూడా పరవలేదు అనిపించింది. ఇదిలా ఉండగా.. సాయి పల్లవి చెల్లెలు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఆమె పేరు పూజ కన్నన్. చూడ్డానికి కొంచెం సాయి పల్లవి లానే ఈ అమ్మడు కనిపిస్తూ ఉంటుంది.

వీళ్లిద్దరికీ ఇంకో సిమిలారిటీ కూడా ఉంది. అదే డ్యాన్స్. సాయి పల్లవి చాలా మంచి డాన్సర్. ఈమె డ్యాన్స్ కు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వయసు వారి దాకా అంతే కాదు టాలీవుడ్ స్టార్లలో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి, అల్లు అర్జున్ వంటి వారు సాయి పల్లవితో డ్యాన్స్ చేయాలని ఉందని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. సాయి పల్లవిలానే పూజా కన్నన్ కూడా మంచి డాన్సర్ అని తాజాగా ప్రూవ్ అయ్యింది.

ఆమె డాన్స్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో ఆమె లంగావోణీలో క్లాస్ గా కనిపిస్తూనే తన అక్కలా స్పీడ్ గా డ్యాన్స్ చేస్తూ ఆశ్చర్యపరిచింది. డాన్స్ విషయంలో తన అక్కకి ఏమాత్రం తీసిపోను అని ప్రూవ్ చేసింది.ఇక ఫైట్ మాస్టర్ స్టంట్‌ శివ దర్శకత్వంలో పూజా కణ్ణన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రస్తుతం టాక్ నడుస్తుంది.

Leave a Reply