Sai Pallvi Dance | చెల్లెలు నిశ్చితార్థ వేడుకల్లో సాయి పల్లవి తీన్మార్ డాన్స్…

allroudadda

Sai Pallvi Dance | సాయి పల్లవి సిస్టర్ ‘పూజ కన్నన్’ ఆమె పోలికలతోనే కనిపిస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంటారు. పూజ కూడా గతంలో ఓ తమిళ సినిమాలో నటించారు. అయితే ఆ తరువాత మళ్ళీ ఆమె స్క్రీన్ పై కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పూజ.. సాయి పల్లవితో కలిసి ఫోటోలు దిగుతూ సందడి చేస్తుంటారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెకు మంచి ఫాలోయింగే ఉంది.ఇది ఇలా ఉంటే, పూజ ఇటీవల తన ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్ వేశారు.

ఆ పోస్టులో పూజ తన ప్రియుడిని పరిచయం చేస్తూ.. “ఇతని పేరు వినీత్. నా సూర్యోదయానికి ఇతను కిరణం లాంటివాడు. స్వార్థం లేకుండా ప్రేమించడం ఎలానో, ప్రేమలో ఓర్పుతో, నిలకడతో ఉండడం ఎలానో వినీతే నేర్పించాడు” అంటూ రాసుకొచ్చారు. అయితే ప్రియుడిని పరిచయం చేసి వారం కూడా కాలేదు అప్పుడే ఎంగేజ్మెంట్ అంటూ ఫోటోలు షేర్ చేశారు.ఎంగేజ్మెంట్ అనంతరం సాయి పల్లవి పూజ కన్నా ఇద్దరు కలిసి కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులతో తీన్మార్ స్టెప్పులు వేశారు.

allroudadda
allroudadda

సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నా కాబోయే పెళ్లికూతురు కూడా స్టెప్పులు ఇరగదీసింది. ప్రస్తుతం ఆ వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాయి పల్లవి మరియు పూజ కన్నా మరియు కుటుంబ సభ్యులు కూడా డాన్స్ వేసి ఎంగేజ్మెంట్ ని బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఆ వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియో చూసినా అభిమానుల పూజకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరు అభిమానులు అయితే సాయి పల్లవి మీ మ్యారేజ్ ఎప్పుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply