Salaar Review | ‘సలార్’ మూవీ రివ్యూ & రేటింగ్..

allroudadda

Salaar Review | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న తెలుగు, కన్నడంతో పాటు హిందీ, తమిళ,మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగధూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ముఖ్యంగా రిలీజ్ ట్రైలర్ అయితే.. సినిమా పై అంచనాలు డబుల్ చేసింది అని చెప్పాలి.అయితే ఈ సినిమా నేడే విడుదల అయింది,

కథ: తన తల్లి ఆస్తికలను గంగలో కలపడం కోసం అమెరికా నుంచి కాశీకి వచ్చిన ఆద్య (శ్రుతిహాసన్)ను రాధారమ మన్నార్ (శ్రియా రెడ్డి) & గ్యాంగ్ టార్గెట్ చేసి చంపాలనుకుంటారు. ఆమెను కాపాడడం కోసం బిలాల్ (మైమ్ గోపీ) ఆమెను.. అస్సామ్ బోర్డర్ లోని టింసాకు అనే గ్రామంలో హెవీ వెహికిల్స్ మెకానిక్ గా ఒక సాధారణ జీవితాన్ని సాగిస్తున్న దేవరథ (ప్రభాస్) & తల్లి (ఈశ్వరీ రావు) వద్దకు తీసుకువస్తాడు.

ఆద్యను కాపాడడం కోసం అజ్ఞాతంలో ఉన్న దేవరథ దాల్చిన ఉగ్రరూపాన్ని చూసి.. ఆమెను వేటాడడం కోసం వచ్చిన మన్నార్ గ్యాంగ్ మొత్తం హడలెత్తుతుంది. అసలు ఎవరీ దేవరథ? మన్నార్ కుటుంబంతో ఇతడికి ఉన్న సంబంధం ఏమిటి? కాన్సార్ అనే దేశంలో దేవరథను ఎందుకు కటేరా తల్లి కొడుకులా భావిస్తారు? వంటి ఆసక్తికరమైన ప్రశ్నల సమాహారమే “సలార్” మొదటి భాగం.

allroudadda
allroudadda

నటి నటుల పనితీరు,

నిజంగా ప్రభాస్ తప్పితే ఆ పాత్రకు మరో నటుడు సరితూగడు. అంత పవర్ ఫుల్ గా సాగింది దేవ పాత్ర. ఒక సన్నివేశంలో ఓ బామ్మ దేవ దగ్గరికి వచ్చి తనని తాకాలని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే.. ‘నువ్వు నిజమేనా.. కాదా’’ అని చెబుతుంది. అంత అన్ బిలివబుల్ గా ఉంటాడు దేవ. తన పాత్రకు ఎక్కవ డైలాగులు లేవు. చెప్పిన కొన్ని డైలాగ్స్ మాత్రం పేలాయి. వ‌ర‌ద రాజమ‌న్నార్ గా పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ ఆకట్టుకుంటాడు. తన పాత్రని తీర్చిద్దిన విధానం బావుటుంది.

allroudadda
allroudadda

అధ్య పాత్రలో శ్రుతి హాసన్ సహజంగా కనిపించింది కానీ తన కథ ఏమిటనేది ఇంకా రివిల్ కాలేదు. జ‌గ‌ప‌తిబాబు, మైమ్ గోపి, బాబీ సింహా, శ్రియారెడ్డి, ఝాన్సీ ఇలా పాత్రలు ప‌రిధి మేర‌ ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా నేపధ్య సంగీతం మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ ఎలివేషన్స్ సీన్స్ లో మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. కెమెరా పనితనం, ఎడిటింగ్ ప్యాట్రన్ ప్రశాంత్ నీల్ మార్క్ లో వుంది. కేజీఎఫ్ లా ఒకే సీన్ లోనే రెండు మూడు లేయర్లు కథని చూపించడంలో సలార్ కూడా కనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. కాన్సార రాజ్యాన్ని సెటప్ చేసిన విధానం కొత్తగా వుంటుంది.

రేటింగ్ : 3/5

Leave a Reply