షూటింగ్ కోసం సమంత ఆమె ధరించిన జువెలరీ ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!

సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ‘శాకుంతలం’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా రిజల్టును గురించి పెద్దగా పట్టించుకోకుండా, ఆ తరువాత తాను చేయవలసిన వెబ్ సిరీస్ పై సమంత దృష్టి పెట్టింది. ప్రస్తుతం ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కోసం లండన్ వెళ్లిన ఆమె, అక్కడ ఖరీదైన డ్రెస్ తో .. జువెలరీతో మెరిసింది. సమంత బ్లాక్ స్కర్ట్ ధరించింది ..

అయితే ఇది సాధారణమైంది కాదు. విక్టోరియా బెక్ హామ్ క్రేవిచ్ ప్యాచ్ వర్క్ తో కూడినది. చేప ఆకృతిలోని ఈ స్కర్టు ధర 65 వేలు అని తెలుస్తోంది. ఇక ఈ డ్రెస్ పై ఆమె బల్గారి డైమండ్ జువెలరీని ధరించింది. సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ వాటి ధర ఆశ్ఛర్యపోయేలా చేస్తుంది.

సమంత ధరించిన స్నేక్ నెక్ పీస్ ధర 2.9 కోట్లు. ఇక చేతికి ధరించిన స్నేక్ బ్రేస్ లెట్ ధర 2.6 కోట్లు. ఖరీదైన డ్రెస్ లో … జువెలరీతో .. స్టైలీష్ లుక్ తో సమంత ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ వెబ్ సిరీస్ లో ఆమె వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తోంది. ఇక తెలుగులో ఆమె నుంచి ‘ఖుషీ’ రానున్న సంగతి తెలిసిందే.

Leave a Reply