Samantha : అమ్మో సమంతకు మ్యాథ్స్ లో 100, ఫిజిక్స్ లో 95, ఇంగ్లీషులో..?

గుణశేఖర్ రచన, దర్శకత్వం వహించిన సినిమా శాకుంతలం. ఈ సినిమాలో శకుంతల క్యారెక్టర్ లో సమంత నటించింది. దేవ్ మోహన్ దాస్ లీడ్ రోల్ పోషించాడు. ప్రేక్షకుల్లో ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్లు రాబట్టలేకపోయింది. దాంతో సినిమా నిర్మాతలు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు.రూ.65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన శాకుంతలం.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

డిస్టిబ్యూటర్లు, శాటిలైట్ రైట్స్ ఇలా అన్నింటినుంచి నష్టాలే ఎదురయ్యాయి. దీంతో నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ గుణశేఖర్ దాదాపు రూ.20 కోట్ల నష్టం ఏర్పడింది.కాసేపు సినిమా సంగతి పక్కన పెడితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా చదువులో టాలెంటెడ్ స్టూడెంట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత స్కూల్ మార్కుల రిపోర్ట్ కార్డు మరోసారి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

సమంత 10వ తరగతిలో 1000 మార్కులకు 887 మార్కులు సాధించింది. సమంత మ్యాథమెటిక్స్‌లో 100/100, ఫిజిక్స్‌లో 95/100 మార్కులు సాధించింది. ఇంగ్లీషులో 90, బోటనీలో 84, హిస్టరీలో 91, జాగ్రఫీలో 83 మార్కులు సాధించి తన భాష (తమిళం) పేపర్‌లో 88 మార్కులు సాధించింది. అన్ని సబ్జెక్టులను సమంతకు 80 శాతానికి పైగా మార్కులు వచ్చాయి. సమంత 2001- 2002 లో చెన్నైలోని హోలీ ఏంజిల్స్ స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకుంది.

అంతే కాకుండా సమంత డిగ్రీ 2007లో పూర్తి చేసింది. సమంత చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్ లో బీకాం గ్రూప్ తీసుకుని డిగ్రీ పూర్తి చేసింది. ఇక పదవ తరగతి లోనే కాకుండా డిగ్రీలోనూ సమంత చదువులో రాణించింది. కానీ సమంత నటన పై ఉన్న ఆసక్తి తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక చదువుకొనే కాదు నటనలోనూ తాను గ్రేట్ అని నిరూపించుకుంది.

Leave a Reply