Samantha: శోభిత-నాగచైతన్య డేటింగ్‌పై సమంత షాకింగ్ కామెంట్స్..!

సమంత తో విడిపోయిన తర్వాత నటుడు నాగచైతన్య పై అనేక రూమర్స్‌ వస్తున్న విషయం తెలిసిందే. శోభిత ధూళిపాళతో నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారంటూ టాలీవుడ్‌, పలు వెబ్‌సైట్లలో సైతం వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఆ వార్తలపై ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి రిలేషన్‌ షిప్‌పై నటి సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

సమంత నిన్న ఒక ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. తన వ్యక్తిగత జీవితం తాలూకు అనేక విషయాలపై నిర్మొహమాటంగా అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తోంది. ఇటీవల నాగచైతన్యతో తన దాంపత్య జీవితంపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు నాగచైతన్య-శోభిత డేటింగ్‌పై నటి స్పందించిందంటూ పలు వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. ‘ఎవరు ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నారనేది నేను పట్టించుకోను.

ప్రేమకు విలువ ఇవ్వనివారు ఎంతమందితో డేటింగ్‌ చేసినా, చివరికి కన్నీళ్లే మిగులుతాయి. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుని, అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది’ అన్నది ఆ వార్తల సారాంశం. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. కాగా, ఈ కామెంట్లపై సామ్‌ స్పందించారు. తాను ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply