Samantha | వాటి ప్రమోషన్ కోసం సమంత ఎంత తీసుకుంటుందో తెలుసా.

Samantha

Samantha | టాలీవుడ్ సార్ బ్యూటీ సమంత ఒకవైపు సినిమాలతో మాత్రమే కాకుండా మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో కూడా బాగానే సంపాదిస్తోంది. ఒక్కో సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో పెద్దపెద్ద బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బాగానే వెనకేస్తోంది. తాజాగా బర్బరీ అనే ఒక ప్రముఖ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ ఫారం బ్రాంచ్ నుంచి ఈ సమంత భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.బర్బరీ బ్రాండ్ నుంచి స్విమ్మింగ్ బట్టలు వేసుకుని ఫోటో లకి ఫోజ్ ఇచ్చింది సమంత. ఆమె వేసుకున్న స్విమ్ వేర్ ఖరీదు $400 అంటా.

అంటే మన కరెన్సీలో 30 వేల రూపాయలు. అయితే ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసినందుకుగాను సమంత అందుకున్న రెమ్యూనరేషన్ మాత్రం 90 లక్షలు అని తెలుస్తోంది. ఇలా సోషల్ మీడియా లో సమంత నెలకి కనీసం మూడు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ వాటి గాను ఒకటి నుంచి మూడు కోట్ల వరకు తీసుకుంటోంది. ప్రస్తుతం (Samantha) సమంత బికినీ ఫోటోలు, ఎమోషనల్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Leave a Reply