Samantha: గొప్ప వీరాభిమాని సమంతకు గుడి కట్టిన యువకుడు..! ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటానికి ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత నటి మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా.. మధ్యతరగతి జీవితాన్ని అనుభవించి ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన సమంతకి పేదల కష్టాలు చాలా బాగా తెలుసు. అందుకే సమంత తనకి సమయం దొరికిన ప్రతిసారి సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లను చేయించడంలో ఆమె చూపిన చొరవ చెప్పలేనిది అనే చెప్పాలి.

ఈ క్రమంలోని సమంత మానవత్వానికి ఫిదా అయిపోయాడు ఒక వీరాభిమాని. సమంతపై తనకి ఉన్న అభిమానంతో ఏకంగా సమంతకి గుడి కట్టాడు ఆ అభిమాని. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్ అనే ఒక యువకుడు సమంతా కి పెద్ద అభిమాని. ఆమె నటనతో పాటు తన సేవా కార్యక్రమాలకు ఫిదా అయిన ఆయన ఏకంగా సమంతకి గుడి కట్టాడు.

అయితే ఎందరో అనారోగ్యం పాలైన చిన్న పిల్లలకు సమంత పునర్జన్మ ఇవ్వడంతో తనపై ఉన్న అభిమానం మరింత ఎక్కువ అవ్వడంతో సమంతకి ఏకంగా గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు ఆ అభిమాని. తన ఇంటి ప్రాంగణంలోనే ఆలయం కోసం స్థలం కేటాయించి విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు. ప్రస్తుతం విగ్రహానికి, ఆలయానికి తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. రేపు (ఏప్రిల్‌ 28) వ తేదీన సమంత పుట్టిన రోజు సందర్భంగా ఈ గుడిని ప్రారంభించనున్నట్లు సందీప్‌ తెలిపారు.

Leave a Reply