సీనియర్ నటుడు శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత…! షాక్ లో పరిశ్రమ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించుకున్న శరత్ బాబు… తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించారు. ఈయన ఆసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. హీరోగా శరత్ బాబు తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. ఆ తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు.

మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు.ఐతే మరోసారి నటుడు శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన బెంగుళూరులో చికిత్స తీసుకున్నారు.

తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు శరీరం సహకరిస్తుండటంతో శరత్ బాబును ఐసీయూ నుంచి సాధారణ విభాగానికి మార్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. శరత్ బాబు త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Leave a Reply